మళ్లీ విశాఖలోనే: పెట్టుబడులపై బాబు ఉత్సాహం, వేగంగా ఇస్తాం: గవర్నర్
విశాఖ: వచ్చే ఏడాది మరోసారి భాగస్వామ్య పెట్టుబడుల కోసం విశాఖలోనే సమావేశం కాబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రకటించారు. భాగస్వామ్య సదస్సు మూడోరోజైన మంగళవారం నాడు విజయవంతంగా ముగిసింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని చెప్పారు. దేశంలో వ్యవసాయం చాలా కీలకరంగమని చెప్పారు. రూ..4.78 లక్షల కోట్ల అవగాహన ఒప్పందం కుదిరిందని చెప్పారు.
సదస్సుకు సహకరించిన వారందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది మరోసారి విశాఖలోనే సమ్మిట్ ఉంటుందని చెప్పారు. ఏపీని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎంవోయుల వల్ల పదిలక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చంద్రబాబు చెప్పారు.

ఏపీలో ఇచ్ఛాపురం నుంచి తడ వరకు అందమైన బీచ్‌ల ఏర్పాటుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కోనసీమ ఓ అందమైన ప్రదేశమని, అక్కడ పర్యాటక రంగంలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా చేస్తామన్నారు.
అంతర్గత జల రవాణా మార్గాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజల ఆలోచనా విధానం మారిందని, మెరుగైన వసతులు కోరుకుంటున్నారని చెప్పారు. విశాఖ, తిరుపతి, విజయవాడ నగరాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. సదస్సులో 331 ఒప్పందాలు కుదిరాయని చెప్పారు.
వేగంగా అనుమతులు కల్పిస్తాం: గవర్నర్ నరసింహన్
పారిశ్రామికవేత్తలకు వేగంగా అనుమతులు, మౌలిక వసతులు కల్పిస్తామని గవర్నర్ నరసింహన్ చెప్పారు. పెట్టుబడులు లేకుంటే సమ్మిళిత అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. ఫార్మా రంగంలో పరిశోధనలు జరగాలన్నారు.












Click it and Unblock the Notifications