పోసానికి తీవ్ర అస్వస్థత..! రాజంపేట జైలు నుంచి ఆస్పత్రికి..!
చంద్రబాబు, పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు అయి రాజంపేట సబ్ జైల్లో ఉన్న టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆస్పత్రిలో పోసాని పరిస్ధితిపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

పోసాని కృష్ణ మురళికి స్వల్ప అస్వస్థత. రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోసానికి చికిత్స.!#Posani #PosaniKrishnaMurali #PosaniHealth #PosaniArrest #HealthUpdate #OITelugu pic.twitter.com/qXHMOcZvSt
— oneindiatelugu (@oneindiatelugu) March 1, 2025
రెండు రోజుల క్రితం కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పోసాని కృష్ణమురళిని పోలీసులు రిమాండ్ పై రాజంపేట జైలుకు తరలించారు. అక్కడే ఉంటున్న ఆయన ఇవాళ తనకు గుండెనొప్పి వచ్చినట్లు జైలు అధికారులకు చెప్పినట్లు తెలుస్ోతంది. దీంతో పోసాని కృష్ణ మురళిని వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో పోసాని కృష్ణ మురళికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పోసానిని హైదరాబాద్ లో అరెస్టు చేేశాక అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లెకు తెచ్చే మధ్యలోనే విరోచనాలు అయినట్లు సమాచారం. ఆ తర్వాత వైద్య పరీక్షల్లోనూ ఆయనకు గండె సమస్యలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు.
మరోవైపు పోసాని కృష్ణమురళిపై ఏపీలో వరుసగా కూటమి నేతలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే పోసాని అరెస్టుపై స్థానిక కోర్టు రిమాండ్ విధించడంతో దీనిపై హైకోర్టును ఆశ్రయించేందుకు ఆయన లాయర్ పొన్నవోలు సిద్దమవుతున్నారు. ఈ సమయంలో పోసాని అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. పోసాని అరెస్టుపై ఇప్పటికే వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పోసానిపై కూటమి ప్రభుత్వం వేధింపులు ఆపాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications