ఓట్ల కౌంటింగ్ ఓపెనింగ్ లో ఆ పార్టీకే ఫుల్ కౌంట్ - ఆ తరువాత..!!

ఏపీలో అధికారం దక్కేదెవరికి. పోలింగ్ ముగిసిన తరువాత ఫలితాల పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది. సీఎం జగన్ 2019లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు. టీడీపీ కూటమి నేతలు గెలుపు పైన ఆశతో ఉన్నారు. ఇక..సర్వే సంస్థలు పోస్ట్ పోల్ సర్వేల పేరుతో ఓటర్ల పల్స్ తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక..ఎన్నికల ఓట్ల లెక్కంపు సమయంలో మొదలయ్యే ట్రెండ్స్ పైన ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి.

పెరిగిన పోలింగ్ శాతం
ఏపీలో 2019 కంటే రెండు శాతం పోలింగ్ పెరిగింది. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓట్లేసారు. అర్బన్ కంటే గ్రామీణ ప్రాంతంలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. దీంతో..వైసీపీ గెలుపు తమదే అంటూ ధీమాగా ఉంది. టీడీపీ కూటమి నేతలు ప్రభుత్వం పైన అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని..తాము గెలవటం ఖాయమని విశ్వాసంతో కనిపిస్తున్నారు. ఇక...ఏపీలో మొత్తంగా 3,33,40,333 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో పురుషులు 1.64 కోట్ల మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 1.69 కోట్ల మంది ఉన్నారు. వీరి ఓటింగ్ పైన పార్టీలు భిన్న అంచనాలతో ఉన్నాయి.

Postal Ballots Unveiling the Leading Party on Election Result Day

పోస్టల్ బ్యాలెట్ అనుకూలత
ఇక, హోరా హోరీ పోరులో పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ఓట్ల పైన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఎన్నికల్లోని విధుల సిబ్బంది 4,44,218 మంది ఓటు వేయగా.. 85 ఏళ్ల పైబడిన వారు 13,700 మంది ఓట్లు వేసారు. దివ్యాంగులు 12,700 మంది ఉండగా..ఇతర అత్యవసర సేవల్లోని వారు 27,100 మంది ఓట్లు వేసారు. వీరిలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనేది లెక్కలు మొదలయ్యాయి. ప్రభుత్వం పైన ఉద్యోగ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని...మెజార్టీ ఓట్లు తమకే పడతాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే విధంగా దివ్యాంగుల విషయంలోనూ రెండు పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయి.

తొలి గంటలోనే ట్రెండ్స్ క్లారిటీ
జూన్ 4న కైంటింగ్ ప్రారంభమైన తరువాత తొలుత పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. దీనికి కొనసాగింపుగా హోమ్ ఓటింగ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీంతీ..ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు ఒక పార్టీకి తొలి అరగటం ట్రెండ్స్ కౌంటింగ్ లో అనుకూలంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తరువాత ఈవీఎం కౌంటింగ్ మొదలు అవుతుంది. అప్పటి నుంచి 15-20 నిమిషాల్లో తొలి రౌండ్ ఫలితాలు బయటకు వస్తాయి..అప్పటి నుంచి అసలు ఓట్ల కౌంటింగ్ లెక్కలు..ట్రెండ్స్..పార్టీల లీడ్స్ కొనసాగుతాయి. ఉదయం 10-10.30 గంటల మధ్యలో ఏ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయనేది దాదాపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+