Power Crisis In AP: కేంద్ర మంత్రి చెప్పిన అంశంలో వాస్తవం లేదు- విద్యుత్ కోతలు తప్పేలా లేవు!!

ఏపీలో విద్యుత్ కొరత..వాస్తవ పరిస్థితులపైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. అంతర్జాతీయంగా దేశీయంగా బొగ్గు లభ్యత లేకపోవడం..రేటు పెరగడం వల్ల సమస్య వచ్చిందని వివరించారు. డబ్బు పెట్టినా సమస్యను తీర్చే పరిస్థితి లేదని స్పష్టం చేసారు. ఇళ్లలో వినియోగాన్ని తగ్గించుకోవాలని విజ్ణప్తి చేస్తున్నామన్నారు.
ప్రజలు రాత్రి 6-8 గంటల వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. విద్యుత్ విషయంలో కేంద్ర మంత్రి చెప్పిన అంశంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు.

కేంద్ర మంత్రి వ్యాఖ్యలు నిజం కాదు

కేంద్ర మంత్రి వ్యాఖ్యలు నిజం కాదు

ఆయన చెప్పిన అంశాలను ఖండిస్తున్నామన్నారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగం తగ్గించేలా అవగాహన చర్యలు చేపడుతున్నామని వివరించారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు అమలు చేయాల్సి రావచ్చనే సంకేతాలు ఇచ్చారు. సీఎం జగన్ ఇప్పటికే సమస్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారని వివరించారు. తాజాగా ఇంటి స్థలాలా విషయంలో కోర్టు తీర్పు పైన సజ్జల స్పందించారు. ఇళ్ల స్థలాల పేరిట లబ్దిదారులకు తెలియకుండా కొందరు హైకోర్టులో కేసు వేయించారని ఆరోపించారు.

రాజకీయ శక్తులు వెనుక ఉండి ఇలా

రాజకీయ శక్తులు వెనుక ఉండి ఇలా

రాజకీయ శక్తులు తెరవెనక ఉండి పన్నాగంతో దుష్టక్రీడకు తెరతీశాయని చెప్పారు. 31 లక్షల మందికి గృహనిర్మాణాన్ని చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇళ్లనిర్మాణానికి హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారిందని పేర్కొన్నారు. అఫిడవిట్లు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని తెదేపా అడ్డుకుంటోందంటూ విమర్శించారు. హైకోర్టు సింగిల్ బెంచి ఆదేశాలపై డివిజన్ బెంచ్ కు వెళతామన్నారు. కోర్టు తీర్పు తాత్కాలిక అడ్డంకులే నని భావిస్తున్నామని చెప్పారు. దుర్భుద్దితోనే తెదేపా ఇళ్ల నిర్మాణాలను అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు.

Recommended Video

    Palamuru-Rangareddy Project:NGT లో బలంగా వాదనలు AP VS TS Govt | Irrigation Projects| Oneindia Telugu
    రైతులను తొక్కించి బీజేపీ నేతలు మాట్లాడరే

    రైతులను తొక్కించి బీజేపీ నేతలు మాట్లాడరే

    ఇళ్ల నిర్మాణం అడ్డుకున్న తెదేపాను లబ్ది దారులు చెత్తబుట్టలో వేస్తారని.. తెదేపా కుట్రలను ప్రజలు గమనించాలని కోరుతున్నామని సజ్జల సూచించారు. బద్వేలులో తెదేపా పోటీ పెట్టి ఉంటే బాగుండేదని సజ్జల అభిప్రాయపడ్డారు. భాజపా మతం తప్ప దేన్నీ మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. హిందువులకు అన్యాయం జరుగుతుందని ఆరోపనలు చేస్తున్నారని చెప్పారు. సీఎం చేస్తోన్న పథకాల వల్ల ప్రజలకు ఎందుకు మంచిది కాదో భాజపా నేతలు చెప్పాలని డిమాండ్ చేసారు. కేంద్రం చేసిన అప్పులు, రైతులను కారుతో తొక్కించిన దానిపై భాజపా వారు ఎందుకు మాట్లాడరని నిలదీసారు. జగన్ పై అపోహలు సృష్టించడం, గాలిప్రచారం చేసి మసి పూసేలా భాజపా నేతలు వ్యవహరిస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+