కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు..

కొణిదెల పవన్‌కల్యాణ్‌... ఈపేరు చెబితే చాలు అభిమానులు పూనకాలు వచ్చినట్లు ఊగుతారు. ఒక్కసారైనా ఆయన్ను ప్రత్యక్షంగా కలవాలని, చూడాలని పరితపిస్తుంటారు. అదే కటౌట్ తెరమీదకు రాగానే థియేటర్లు దద్దరిల్లిపోవడమేకాదు.. బాక్సాఫీస్ లు బద్దలైపోతాయి. అభిమానులకు దగ్గరగా ఉండేందుకు సినిమా హీరోలు సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంటారు.

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు తన అభిమానులకు మరింత చేరువయ్యారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో ఉన్న ఆయన తాజాగా ఇన్‌స్టాలో అడుగు పెట్టారు. ఉదయం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా అందుబాటులోకి రాగా, కొద్దిసేపటికే వెరిఫైడ్‌ లభించింది. ఖాతాను ప్రారంభించిన కొద్ది గంటల్లోనే మిలియన్‌ ఫాలోవర్స్‌ను దాటేశారు.

power star pawan kalyan enter the instagram

ట్విటర్‌ ఖాతాకు ఏ ప్రొఫైల్ ఫొటో ఉందో దాన్నే ఇన్ స్టాగ్రామ్‌కు కూడా వినియోగించారు. రాజకీయాలకు సంబంధించిన విషయాలనే ఎక్కువగా ట్విటర్ ద్వారా పంచుకుంటున్నారు. రాజకీయాలతో పాటు, సినిమా విశేషాలను కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయాలని నిర్ణయించారు. 'ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో .. జై హింద్!" అనే స్లోగన్ ను దీనికి చేర్చారు.

పవన్ కల్యాణ్ ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి 'బ్రో' చిత్రంలో నటించారు. జులై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సముద్రఖని దర్శకుడు. దీంతో పాటు, సుజిత్‌ దర్శకత్వంలో 'ఓజీ'లో చేస్తున్నారు. ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తయింది. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌'లో ను, జాగర్లమూడితో పీరియాడికల్ మూవీ 'హరి హర వీర మల్లు'లోనూ నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+