వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జలుబు, డస్ట్ ఎలర్జీ, గొంతు నొప్పి: అయినా జగన్ యాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్ జలుబుతో బాధపడుతున్నారు. దాంతో పాటు డస్ట్ ఎలర్జీ కూడా ఆయనకు సమస్యగా మారింది.

జగన్ గొంతు నొప్పితో కూడా బాధపడుతున్నారు. దాంతో కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. అయినా ఆయన తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిలాల్లో ఆయన యాత్ర సాగుతోంది.

 దట్టమైన ధూళి రేణువులు

దట్టమైన ధూళి రేణువులు

దట్టంగా లేస్తున్న ధూళి రేణువుల వల్ల జగన్‌ను డస్ట్ అలర్జీ పట్టుకుంది. అయినప్పటికీ ఆయన అభిమానులతో, ప్రజలతో మాట్లాడుతూ విరామం లేకుండా పాదయాత్ర సాగిస్తున్నారు. రరోూ రాత్రి పనులను పూర్తి చేసుకుని తనను కలిసేందుకు వస్తున్నవారితో మాట్లాడుతున్నారు.

 ఆలస్యయంగా నిద్రపోవడం...

ఆలస్యయంగా నిద్రపోవడం...

జగన్ ఆలస్యంగా నిద్రపోతున్నారు. మర్నాడు ఉదయమే నిద్ర లేచి ఎనిమిదిన్నర గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దీంతో నిద్ర తక్కువ అవుతోంది. మధ్యాహ్న భోజన సమయంలో కూడా ఎవరో ఒక్కరు కలిసేందుకు వస్తున్నారు. అప్పుడప్పుడు భోజన విరామానికి కూడా ఆగడం లేదు.

 మూడు రోజులుగా గొంత నొప్పి

మూడు రోజులుగా గొంత నొప్పి

గత మూడు రోజులుగా జగన్‌కు గొంతు నొప్పి, జలుబు పెరిగాయి. రోడ్ల వెంట లేస్తు్న దుమ్మూ ధూళి నోటిలోకి పోతుండడంతో గొంతు నొప్పి వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జలుగు, దగ్గు వల్ల జగన్ నలతగా ఉన్నారు. గురు, శుక్రవారాల్లో ఎండ ఎక్కువగా ఉంది. దీంతో గొంతు త్వరగా తడారిపోతోంది.

 జగన్ బరువు తగ్గారు...

జగన్ బరువు తగ్గారు...

కడప జిల్లా ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జనగ్ ఆరున్నర కిలోల బరువు తగ్గారు. కనీసం రెండు రోజులైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సలహా పాటించాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. అయినా జగన్ వినడం లేదు.

English summary
The YSR Congress party president YS Jagan was suffering from cold during his Praja SankalpaYatra in Chittoor district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X