వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న‌న్నా.. కాస్తంత న్యాయం చేయ‌న్నా.. బాలినేని అనుచ‌రులు వేధిస్తున్నారంట‌!!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌మ‌కు న్యాయం చేయాల‌ని ప్ర‌కాశం జిల్లా కొత్త‌పట్నం మండ‌లం అల్లూరు గ్రామ‌స్తులు కోరుతున్నారు. నెల‌రోజుల క్రితం జ‌రిగిన ''గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం'' కార్య‌క్ర‌మంలో భాగంగా మాజీ మంత్రి బాలినేనిని రైతుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించినందుకు క‌విత అనే మ‌హిళ ఇంటి గేటుకు తాళాలు వేశార‌ని, ఆమె ఇంటికి నీళ్లు, పాలు రాకుండా అడ్డుకుంటున్నార‌ని తెలిపారు.

మొన్న శ్రీ‌కాళ‌హ‌స్తిలో కూడా సాయం చేశారు!

మొన్న శ్రీ‌కాళ‌హ‌స్తిలో కూడా సాయం చేశారు!

అపాచీ ప‌రిశ్ర‌మ ప్రారంభానికి వెళ్లి తిరుగు ప‌య‌న‌మైన స‌మ‌యంలో రోడ్డుప‌క్క‌న ఒక జంట మీ సాయం కోసం ఎదురు చూస్తూ నిల‌బ‌డ్డార‌ని, కాన్వాయ్ ఆపి మ‌రీ వారినుంచి విన‌తిప‌త్రం తీసుకొని వారికి కావ‌ల్సిన సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చి మీలోని మాన‌వ‌త్వాన్ని నిరూపించుకున్నారు. దానికి ఆ దంప‌తులు ఎంతో సంతోషించారు. గ‌తంలో కూడా మీరు వెళ్లేదారిలో కాన్వాయ్ ఆపి మ‌రీ ఎంతోమందిని ప‌ల‌క‌రించి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. ఆఘ‌మేఘాల‌మీద వాటిని ప‌రిష్క‌రించిన దాఖ‌లాలు కూడా ఉన్నాయ‌ని, అలాగే కొంచెం పెద్ద మ‌న‌సు చేసుకొని క‌విత స‌మ‌స్య‌ను కూడా ప‌రిష్క‌రించాల‌ని గ్రామ‌స్తులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

ఆడ‌బిడ్డ‌ల‌కు న్యాయం చేయ‌డంలో రాష్ట్రానికి మంచిపేరు వ‌చ్చింది

ఆడ‌బిడ్డ‌ల‌కు న్యాయం చేయ‌డంలో రాష్ట్రానికి మంచిపేరు వ‌చ్చింది


ఆడ‌బిడ్డ‌ల‌కు న్యాయం చేయ‌డానికి దిశ యాప్ తీసుకువ‌చ్చార‌ని, దిశ పోలీస్ స్టేష‌న్లు ఉన్నాయ‌ని, మ‌హిళ ల రక్ష‌ణ కోసం చ‌ర్య‌లు తీసుకుంటున్న ప్ర‌భుత్వాల్లో ఏపీ కూడా ఒక‌ట‌ని దేశ‌వ్యాప్తంగా మంచి పేరు వ‌చ్చింద‌న్నారు. అస‌లు విష‌యం తెలుసుకొని అక్క‌డ ఏం జ‌రిగిందో వివ‌రాలు తెప్పించుకోవాల‌ని, దీనికి బాధ్యులైన‌వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని, మ‌న‌సు ఎంతో బాధ‌ప‌డ‌క‌పోతే ఒక ఆడ‌బిడ్డ ఆ విధంగా వీడియో విడుద‌ల చేయ‌లేద‌ని, క‌చ్చితంగా ఆ వీడియో ఎట్లాగైనా స‌ర్క్య‌లేట్ అయి మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంద‌ని, మీరు చూస్తార‌నే ఆశ‌తోనే ఆ వీడియో చేసింద‌ని, న్యాయం చేయాలంటూ కోరుతున్నారు.

స్థానిక ప్ర‌భుత్వ సిబ్బంది స‌హ‌క‌రించ‌డంలేదు?

స్థానిక ప్ర‌భుత్వ సిబ్బంది స‌హ‌క‌రించ‌డంలేదు?

స్థానికంగా ఉన్న వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, పోలీసులు, ప్ర‌భుత్వ సిబ్బంది అంతా స‌హాయం చేయ‌డానికి నిరాక‌రిస్తున్నార‌ని, ప్ర‌శ్నించ‌డం అనేది ఎక్క‌డైనా స‌హ‌జంగా జ‌రుగుతుంద‌ని, అంత‌మాత్రానికే ఆడ‌బిడ్డ ఇంటికి పాలు రాకుండా అడ్డుకోవ‌డం, మంచినీరు రాకుండా అడ్డుకోవ‌డం మంచిది కాద‌ని, ఇది మీ దృష్టికి తెస్తున్నామ‌ని, స‌త్వ‌ర‌మే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి న్యాయం చేయాల‌ని కోరుతున్న‌ట్లు అల్లూరు గ్రామ‌స్తులు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి బ‌హిరంగంగా విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

English summary
prakasam district Alluru villagers want cm Jagan to do justice to kavitha
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X