తోడేళ్ల గుంపునకు భర్తే నాయకుడు.. మలుపు తిరిగిన ‘రాధ’ కేసు
సిగరెట్లతో కాల్చి, బండరాళ్లతో మోది.. కారుతో తొక్కించి.. ఓ మహిళను దారుణంగా హత్యచేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్ల్లెళ్లపాడు గ్రామ శివారులో కోట రాధ(35) అనే వివాహిత ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. భర్తే ఆమెను కిరాతకంగా హతమార్చినట్లు తెలుస్తోంది. రాధ వద్ద అప్పు తీసుకున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి డబ్బు ఇస్తాను రమ్మనిచెప్పి.. నమ్మకంగా పిలిపించి కిరాతకంగా హత్యచేసి ఉంటాడనే అనుమానాలు అందరిలో రేకెత్తాయి.
మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు: రాధ తల్లిదండ్రులు కూడా పోలీసు ఫిర్యాదులో ఇదే విషయాన్ని తెలిపారు. కాశిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్న తరుణంలోనే ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడలో శుక్రవారం సాయంత్రం రాధ అంత్యక్రియలు ముగిశాయి. వెంటనే ఆమె భర్త, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోట మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి ప్రకాశం జిల్లాకు తరలించారు.

స్నేహితుడి పేరుతో ఛాటింగ్: రాధను ఆమె భర్త మోహన్‌రెడ్డే మరికొందరితో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు పోలీసులు ధ్రువీకరించుకున్నారు. ఉద్యోగం కోల్పోయి కష్టాల్లో ఉన్న స్నేహితుడిని ఆదుకునేందుకు రూ.80 లక్షల వరకు అప్పు ఇవ్వడం, అది తిరిగి రాకపోవడంతో మోహన్ రెడ్డి, రాధ మధ్య కొన్నాళ్లుగా తీవ్ర విభేదాలు తలెత్తాయి. కాశిరెడ్డితో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందంటూ మోహన్‌రెడ్డి తీవ్రంగా అనుమానించాడు. కాశిరెడ్డి పేరుతో సిమ్ కార్డులు కొని, అతని పేరుతో తన భార్యతో సెల్‌ఫోన్‌లో మోహన్‌రెడ్డి ఛాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులిస్తామని కాశిరెడ్డి పేరుతోనే మెసేజ్ పంపించి ఈ నెల 17న ఆమెను కనిగిరి రప్పించాడు. అనంతరం కారులో తీసుకెళ్లి తీవ్రంగా హింసించి హత్య చేసివుంటారని భావిస్తున్నారు.
పట్టించిన అనుమానాస్పద ప్రవర్తన:కనిగిరిలోని పామూరు బస్టాండు సెంటరులో ఎదురు చూస్తున్న రాధ దగ్గరకు ఎరుపు రంగు కారు వచ్చి ఆగింది. ఆ కారు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. భార్య మరణించిన తర్వాత మోహన్‌రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. అప్పు వసూలు కోసం భర్త నుంచి వేధింపులు తీవ్రంగా ఉండటంతో వాటిని తట్టుకోలేక తల్లిదండ్రులు, స్నేహితుల నుంచి రూ.25 లక్షలు తీసుకువెళ్లి ఇచ్చింది.
లోతుగా పోలీసుల దర్యాప్తు:తన స్నేహితుడికి ఇచ్చిన అప్పు వసూలుకు వేధింపులు తాళలేక తన తల్లిదండ్రులు, బంధువుల వద్ద నుంచి రూ.25 లక్షలు తీసుకెళ్లి భర్తకు రాధ ఇచ్చినట్టు తెలిసింది. రుణం తీసుకున్న కేతిరెడ్డి కాశిరెడ్డి అజ్ఞాతంలో ఉండటంతో అందరి దృష్టి అతనిపై మళ్లింది. రాధ హత్యలో మోహన్‌రెడ్డికి ఎవరెవరు సహకరించివుంటారనే కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications