మాడిపోతున్న ప్రకాశం, కడప: 47.5 డిగ్రీల ఉష్ణోగ్రత

Temperature in AP: ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఎక్కడే గానీ తగ్గుముఖం పట్టేలా కనిపించట్లేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోంది. 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత సర్వ సాధారణం అయింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

నడి వేసవిలో రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని జిల్లాల్లో సగటున 44 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోంది.

Prakasam district recorded highest temperature as 47 5 degrees celsius

ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి-రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వీటి తీవ్రత అత్యధికంగా ఉంటోంది. గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డుస్థాయిలో నమోదవుతోంది ఈ ప్రాంతాల్లోనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

శనివారం ప్రకాశం జిల్లాలోని దరిమడుగులో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 47.5 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కడప, నంద్యాల జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కడప జిల్లా కలసపాడులో 46.4, నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో 46.2 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత నమోదైంది.

అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, నెల్లూరు, కాకినాడ వంటి జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత రికార్డయింది. ఆయా జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాల్పులు వీచినట్లు విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+