రైతుల సొమ్ము సినిమాల పాలు: ‘సికిందర్’,‘గోపాలగోపాల’కు ప్రకాశం సొసైటీ నిధులు!

Subscribe to Oneindia Telugu

ప్రకాశం: రైతులు తమకు వ్యవసాయ రుణాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం తమ ఇష్టారాజ్యంగా చేస్తూ లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలో తాజాగా భారీ అక్రమాలు వెలుగుచూశాయి.

సినిమాల మార్కెటింగ్ కోసం..

సినిమాల మార్కెటింగ్ కోసం..

సొసైటీ నిధులను ఏకంగా సినిమాల మార్కెటింగ్ కోసం అధికారులు మళ్లింపు చేయడం సంచలనంగా మారింది. అంతేగాక, తమ అక్రమాలు బయటపడకుండా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.

విభేదాల వల్లే వెలుగులోకి..

విభేదాల వల్లే వెలుగులోకి..

అయితే, సొసైటీలో చోటు చేసుకున్న విభేదాల కారణంగా కొందరు డైరెక్టర్లు.. కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో వీరి బాగోతం బట్టబయలైంది. దీంతో అక్రమాలకు పాల్పడిన ఏడుగురు అధికారులు గోపీకృష్ణ, వెంకటేశ్వర్లు, కోటిరెడ్డి, తాతాచారి, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

సికిందర్, గోపాలగోపాలకు..

సికిందర్, గోపాలగోపాలకు..

ఈ అక్రమార్కులు సొసైటీ నిధులను 2014లో విడుదలైన సికిందర్, గోపాల గోపాల(2015) సినిమాల డిస్ట్రిబ్యూషన్ కోసం మళ్లించినట్లు తేలింది. ఇందు కోసం రూ. 70లక్షల రైతుల సొమ్మును వాడేశారు ఈ అక్రమార్కులు. కాగా, ఈ అక్రమార్కుల చేసిన పనితో సొసైటీకి రూ.30లక్షల మేర నష్టం వచ్చినట్లు ఉన్నతాధికారులు అధికారులు తేల్చారు.

కఠినంగా శిక్షించాలి..

కఠినంగా శిక్షించాలి..

కాగా, మూడేళ్లుగా తమ అక్రమాలను బయటపడకుండా సదరు ఏడుగురు అధికారులు ఆడిటర్లను కూడా ప్రలోభాలకు గురిచేస్తుండటం గమనార్హం. సొసైటీలో నిధుల అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Prakasam District Co Operative Society Funds manipulated by seven officers and they suspended.
Please Wait while comments are loading...