బాబుతో జవదేకర్ భేటీ: తేలుతుందన్న కిషన్ రెడ్డి

ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటుపై తమ పార్టీ జాతీయ నేతలు చర్చలు జరుపుతున్నారని, ఈ రోజు సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. ఎంత తొందరగా పొత్తుల వ్యవహారం తేలితే అంత మంచిదని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదని, నామినేషన్లు దాఖలు చేయాలని చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ప్రజలకు తమ పార్టీకే ఓటు వేయాలని ఆయన అన్నారు. ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల్లో తమ పార్ట అభ్యర్థులు గెలిస్తే గ్రామాల అభివృద్ధికి తీవ్రస్థాయిలో కృషి చేస్తారని ఆయన చెప్పారు.
కాగా, తెలుగుదేశం పార్టీతో పొత్తు వ్యవహారంపై తమ పార్టీ జాతీయ నేతలు చర్చలు జరుపుతున్నారని బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడలో అన్నారు. పొత్తు రెండు పార్టీలకు కూడా మేలు చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications