పవన్ కల్యాణ్‌పై మరోసారి రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ ''గెలిచిన తర్వాత కొత్త అవతారం''
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గడిచిన కొద్దిరోజులుగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యం తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ...పవన్ కల్యాణ్ గారు...మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది .. దయచేసి దర్యాప్తు చేయండి .. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారని పవన్ కల్యాణ్‌ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l
— Prakash Raj (@prakashraaj) September 20, 2024
దీన్ని జాతీయ సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారని పవన్ కల్యాణ్‌ను ఆయన నిలదీశారు. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీకి సైతం కౌంటరిచ్చారు. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ సెటైర్స్ వేశారు. చివరగా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. . అసలు లడ్డూ వివాదానికి ప్రకాష్ రాజ్‌కు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని, అలాంటప్పుడు ప్రకాష్ రాజ్‌కు ఎందుకు ఈ వివాదంపై స్పందిస్తున్నారని పవన్ నిలదీశారు.

అయితే పవన్ తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నానని, ఈ నెల 30న దీనిపై స్పందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. నేను వచ్చిన తర్వాత మీ ప్రతి మాటకు సమాధానం చెబుతానని ప్రకాష్ రాజ్ తెలిపారు.నేను చెప్పిందేంటీ.. మీరు అర్థం చేసుకుంది ఏంటని పవన్ కల్యాణ్‌ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మీకు వీలైతే నా ట్వీట్ మళ్లీ చదువుకోండంటూ పవన్ కల్యాణ్‌కు సెటైర్ వేశారు.
Dear @PawanKalyan garu..i saw your press meet.. what i have said and what you have misinterpreted is surprising.. im shooting abroad. Will come back to reply your questions.. meanwhile i would appreciate if you can go through my tweet earlier and understand #justasking pic.twitter.com/zP3Z5EfqDa
— Prakash Raj (@prakashraaj) September 24, 2024
ఆయన అక్కడితో ఆగకుండా తమిళ హీరో కార్తీ చేత పవన్ కల్యాణ్ సారీ చెప్పించుకున్న ఘటనపై రియాక్ట్ అయ్యారు. కార్తీ హీరోగా నటించిన ''సత్యం సుందరం'' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన కార్తీని లడ్డు కావాలా నయానా అంటూ యాంకర్ అడగడం..దీనిపై కార్తీ స్పందిస్తూ...ఇప్పుడు లడ్డూ సెన్సిటివ్ మ్యాటర్ మాట్లాడకూడదంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోలు ఇలా మాట్లాడకూడదంటూ హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన కార్తీ.. ఆయనకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పడం జరిగింది. దీనిపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ స్పందించారు. ''చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్'' అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. చేయని తప్పుకి తమిళ కార్తీతో సారీ చెప్పించడంపై ఆయన ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారని అర్థం అవుతోంది.తాజాగా మరోసారి పవన్ కల్యాణ్‌పై ఆయన పరోక్షంగా ట్వీట్ చేశారు.
చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్... #justasking
— Prakash Raj (@prakashraaj) September 25, 2024
''గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం... ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?'' అంటూ ప్రకాష్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌లో ఎక్కడా కూడా పవన్ కల్యాణ్ పేరును ఆయన ప్రస్తావించలేదు. అయినప్పటికీ ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే చేశారని అర్థం అవుతోంది. ఎన్నికల సమయంలో అన్ని మతాలకు పెద్దపీట వేస్తానని చెప్పిన పవన్ కల్యాణ్, గెలిచిన తర్వాత కేవలం హిందూ మతానికి మాత్రమే పెద్దలాగా వ్యవహరించడంతో ఆయన ఈ ట్వీట్ చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి పవన్ చేసిన ట్వీట్‌పై పవన్ కల్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం..
— Prakash Raj (@prakashraaj) September 26, 2024
ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం?
జస్ట్ ఆస్కింగ్? #justasking












Click it and Unblock the Notifications