Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా ట్రాక్ రికార్డును దెబ్బ తీసింది - ఏపీలో వైసీపీతో : ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో..!!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన ట్రాక్ రికార్డు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తాను 2011 నుంచి 2021 మధ్య కాలంలో ఏ పార్టీ కోసం రాజకీయ భాగస్వామిగా పని చేసిందీ.. ఎక్కడ ఏం జరిగిందీ వివరించారు. బిహార్ రాష్ట్రంలో మార్పు కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు..అందు కోసం పాదయాత్ర చేస్తానని కొద్ది కాలం క్రితం ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ వైశాలి జిల్లాలో ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ తన ట్రాక్ రికార్డును దెబ్బతీసిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తాను మునిగిపోవడమే కాకుండా.. తోటివారినీ ముంచేస్తోందంటూ వ్యాఖ్యానించారు.

2019లో వైసీపీ గెలుపులో..

2019లో వైసీపీ గెలుపులో..

అందుకే ఆ పార్టీతో పనిచేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 2017 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి ఓడిపోయినట్లు చెప్పిన ఆయన.. దీని ఫలితంగానే ఆ పార్టీతో పనిచేయకూడదని నిశ్చయించుకున్నట్లు వెల్లడించారు. 2011 నుంచి 2021 మధ్య 11 ఎన్నికలతో తాను భాగస్వామ్య బాధ్యతలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసారు.

వరుసగా జరిగిన ఎన్నికల్లో ఒక చోట మాత్రమే ఓడిపోయిన విషయాన్ని వివరిస్తూ.. కారణాలను సైతం విశ్లేషించారు. 2015లో బిహార్​లో మహాఘట్​బంధన్​ను గెలిపించామన్నారు. 2016లో పంజాబ్ ఎన్నికల్లో గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. 2019లో ఏపీ లో వైసీపీతో కలిసి పని చేసి గెలిచిన విషయాన్ని ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2020లో దిల్లీ, 2021లో తమిళనాడు, బంగాల్​ రాష్ట్రాల్లో వరుస విజయాల గురించి వివరించారు.

కాంగ్రెస్ తో అందుకే దూరం

కాంగ్రెస్ తో అందుకే దూరం

2017లో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్​తో కలిసి పనిచేశామని చెబుతూ... అక్కడ ఓడిపోయామని చెప్పారు. అందువల్లే కాంగ్రెస్​తో పనిచేయకూడదని అనుకున్నట్లుగా అసలు విషయాన్ని బయట పెట్టారు. పదేళ్లలో తాను 11 ఎన్నికల్లో పాల్గొంటే ఒక్కటే ఓడిపోయామని.. అది కూడా కాంగ్రెస్​తో కలిసినప్పుడే ఓడిపోయిన విషయాన్ని వివరిస్తూ..తన ట్రాక్ రికార్డును వారు దెబ్బతీశారని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు.

రెండు నెలల క్రితం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. పార్టీ అధినేత్రి సోనియాతో సమావేశం అయ్యారు. పార్టీలో మార్పులు అవసరమని వివరిస్తూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చారు.

జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక

జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక

కానీ, తాను పార్టీలో చేరటం లేదంటూ -తరువాత ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక, ఆ తరువాత బీహార్ లో పరిస్థితుల పైన ఫోకస్ చేసారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు 18 వేల మందిని కలుస్తానని వివరించారు.

ఇక, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పైన చేసిన వ్యాఖ్యలతో ఆయన 2024 ఎన్నికలకు సైతం కాంగ్రెస్ తో కలిసి కూటమి ఏర్పాటు.. కాంగ్రెస్ తో కలిసి పని చేసే అవకాశాలు లేనట్లుగానే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పై రాజకీయంగా చర్చ కు కారణమయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+