ఏపీలో ప్రశాంత్ కిశోర్ గుట్టు రట్టు చేసిన మమత బెనర్జీ
Prashant Kishor: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది. ఆ వెంటనే నామినేషన్ల పర్వం ఆరంభమౌతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.
నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 25. 26వ తేదీన వాటిని స్క్రూటినీ చేస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ వరకు గడువు ఉంటుంది. మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు షెడ్యూల్ అయింది.

ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనంటూ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇదివరకు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో- ఏపీలో ఆయన ఎవరికి వ్యూహకర్తగా వ్యవహరిస్తోన్నారనేది తేటతెల్లం చేశాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అయిదేళ్ల కాలంలో రోడ్లు, రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టలేదని, అప్పు తెచ్చయినా ప్రతి నెలా డబ్బులు పంచడానికే ప్రాధాన్యత ఇస్తోన్నారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు ప్రతికూలంగా వ్యాఖ్యలు చేయడం అప్పట్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. ఓ బెంగాలీ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్.. తమ పార్టీ కోసం పని చేయట్లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్.. ఏపీ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారని మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తోన్నారని స్పష్టం చేశారు. ఐప్యాక్‌కే చెందిన ప్రతీక్ జైన్, ఆయన టీమ్ తమకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తోన్నారని తెలిపారు.
ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని, ఆ కారణంతోనే ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలు మళ్లీ విజయం సాధిస్తాయంటూ చెబుతున్నాడని మమత బెనర్జీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాకు వ్యతిరేకంగా ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు చేయడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని అన్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications