వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇకనైనా కదలండి: జగన్ పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్న ప్రశాంత్ కిషోర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తన విజయం కోసం నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పనిని ప్రారంభించాడు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తన విజయం కోసం నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పనిని ప్రారంభించాడు. మరో రెండేళ్లలో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కృషి చేస్తున్నారు.

పరిచయం

పరిచయం

ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం అన్ని నియోజకవర్గాల ఇంఛార్జీలతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను అందరికీ పరిచయం చేశారు. అనంతరం ఏపీలోని 175 నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు.

ఇప్పటి నుంచే..

ఇప్పటి నుంచే..

2019 అసెంబ్లీ ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలు చేయాలని, ప్రతి పోలింగ్ బూత్ స్థాయి నుంచి బలోపేతం కావడంపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

యాక్టివ్‌గా ఉండాలి..

యాక్టివ్‌గా ఉండాలి..

ఈ సందర్భంగా తన టీంలోని ముఖ్యమైన సభ్యులను పరిచయం చేశారు. వారు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారని చెప్పారు. ప్రతి వైసీపీ నాయకుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని సలహ ఇచ్చారు.

కీలక సూచనలు..

కీలక సూచనలు..

కనీసం నెలకోసారి సమావేశమై పార్టీ బోపేతం అవుతున్న తీరును సమీక్షించుకోవాలని అన్నారు. ఎన్నికల దగ్గరపడుతన్న నేపథ్యంలో మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు కృషి చేయాలని ప్రశాంతి కిషోర్ సూచించారు. నేతలకు ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ పలు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది.

English summary
Political strategist Prashant Kishor on Monday took a class to ysrcp leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X