విశాఖలో పీకే టీమ్ సర్వే-వైసీపీ తాజా పరిస్ధితిపై ఫీడ్ బ్యాక్-రాజధాని ఆలస్యం-నేతల్లో అసంతృప్తి, ?

ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. త్వరలో రెండున్నరేళ్లు పూర్తి చేసుబోతోున్న వైసీపీ సర్కార్.. సీఎం జగన్ మానసపుత్రిక అయిన మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేయలేని పరిస్దితి ఉంది. అదే సమయంలో మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి పరిస్ధితి. అప్పటిలోగా మూడు రాజధానుల ప్రక్రియ కొలిక్కి తీసుకురావడంలో విఫలమైతే విమర్శలు ఎదుర్కోక తప్పదు. దీంతో మూడు రాజధానుల ఆలస్యంపై జనం రియాక్షన్ ఎలా ఉందో వైసీపీ సర్కార్ తెలుసుకుంటున్నట్లు సమాచారం.

 వైసీపీ మూడు రాజధానులు

వైసీపీ మూడు రాజధానులు

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విభజన తర్వాత ఏపీకి రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా నిర్ణయించి అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. కానీ వైసీపీ సర్కార్ రాకతో అమరావతి కాస్తే వెనక్కి వెళ్లిపోయి దాని స్ధానంలో మూడు రాజధానులు తెరపైకి వచ్చాయి.

వీటిని ఉత్సాహంగా తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ వాటిని అమల్లోకి తీసుకురావడంలో మాత్రం విఫలమైంది. ఫలితంగా రెండేళ్లుగా రాజధానుల్లేని రాష్ట్రంగా మరోసారి ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. దీంతో మూడు రాజధానుల ప్రక్రియపై సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్దితి.

రాజధానులపై జగన్ ఫీడ్ బ్యాక్

రాజధానులపై జగన్ ఫీడ్ బ్యాక్

వైసీపీ సర్కార్ చేపట్టిన మూడు రాజధానుల ప్రక్రియ నానాటికీ ఆలస్యమవుతున్న తరుణంలో సీఎం జగన్ తో పాటు మంత్రులపైనా ఒత్తిడి పెరుగుతోంది. దీని ప్రభావం కార్యనిర్వాహక రాజధాని (అసలు రాజధాని) అయిన విశాఖపై ఎక్కువగా కనిపిస్తోంది. రాజధాని దూరం చేశారనే కోపం అమరావతిలో ఎలాగూ ఉండనే ఉంది. చివరిగా న్యాయరాజధానికి హైకోర్టు తీసుకెళ్లలేకపోవడంతో ఆ మేరకు అక్కడా అసంతృప్తి పెరుగుతోంది. దీంతో ప్రజల్లో రాజధానులపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్యమవుతున్నాయో తెలుసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించిట్లు తెలుస్తోంది.

 విశాఖలో పీక్ టీమ్ సర్వే

విశాఖలో పీక్ టీమ్ సర్వే

కార్యనిర్వాహక రాజధాని అయిన విశాఖపట్నాన్ని వైసీపీ సర్కార్ కీలకంగా భావిస్తోంది. దీంతో రాజధాని తరలింపు ప్రభావం పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా అక్కడే ఎక్కువగా ఉంటుంది దీంతో వైజాగ్ లోని వైసీపీ నేతలతో పాటు సాధారణ ప్రజల్లో సైతం రాజధానిపై నెలకొన్న అభిప్రాయాల్ని వైసీపీ ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందుకోసం గతంలో తమ పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీమ్ సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో నగరంలో రెండు రోజులుగా పీకే టీమ్ పర్యటిస్తోంది. వివిధ స్ధాయిల్లో వైసీపీ నేతలతో భేటీ అయి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా వైసీపీ భనిష్యత్ వ్యూహాలు ఖరారయ్యే అవకాశాలూ లేకపోలేదు.

పీకే సర్వే అజెండా ఇదేనా?

పీకే సర్వే అజెండా ఇదేనా?

ప్రస్తుతం వైజాగ్ లో పర్యటిస్తున్న పీకే టీమ్ తమ అజెండాలో రెండు కీలక అంశాలపై సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాజధాని ఆలస్యంతో అధికార వైసీపీ నేతలతో పాటు సామాన్య ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ప్రజలపై వీటి ప్రభావం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని ఆలస్యం కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు ఈ మధ్య స్వరం పెంచుతున్నారు.

వీరి నోళ్లు మూయించేందుకు ఇప్పటికే మున్సిపల్ మంత్రి బొత్స, ఉత్తరాంద్ర వైసీపీ ఇన్ ఛార్జ్ విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పీక్ టీమ్ వైజాగ్ సర్వే వైసీపీ నేతల్లో కలకలం రేపుతోంది. రేపు జగన్ కు పీక్ టీమ్ ఇచ్చే సర్వే ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో అన్న ఆందోళన వారిలో పెరుగుతోంది.

సాయిరెడ్డికి కత్తెర పడుతుందా?

సాయిరెడ్డికి కత్తెర పడుతుందా?

వైజాగ్ లో పీకే టీమ్ సర్వే తర్వాత పడబోయే తొలి వేటు ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డిపైనే అన్న ప్రచారం కూడా జరుగుతోంది స్ధానిక వైసీపీ నేతలు ఇప్పటికే ఆయన తీరుపై అసంతృప్తిగా ఉన్నారని, అదే విషయాన్ని పీకే టీమ్ కు కూడా చెప్తున్నారన్న ప్రచారం నెలకొంది.

దీంతో పీకే టీమ్ కు వైసీపీ నేతలు సాయిరెడ్డిపై గట్టిగానే ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే తర్వాత జగన్ సాయిరెడ్డిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెప్తున్నారు. ఇందులో వాస్తవమెంత ఉన్నప్పటికీ.. వైసీపీ నేతలతో సాయిరెడ్డి గ్యాప్ గతంలోనే బహిరంగంగానే బయటపడిన చరిత్ర ఉండటం మాత్రం వీటికి బలం చేకూరుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+