ప్రశాంత్ కిశోర్ టార్గెట్ ఎవరు - కీలక వ్యాఖ్యలు, తెర వెనుక..!!

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజుల క్రితం ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమం పైన ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. సమాజంలో సంపద పెరిగే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాని సూచించారు. అప్పుడే మన భావితరాలకు మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాను రాజకీయంగా పని చేసిన పార్టీలు అధికారంలోకి వచ్చి సరిగ్గా పని చేయకపోతే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వైసీపీతో సహా పలు పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ కిశోర్ ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలు..సదస్సుల్లో పొల్గొని తన మనుసు లోని అభిప్రాయాలను బయట పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలోని పరిస్థితుల పై ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రశాంత్ కిషోర్ సంక్షేమ కార్యక్రమాలు ఉండాల్సిందే అని స్పష్టం చేసారు.

Prashant Kishore: Backlash mounts as this political strategist questions the legitimacy of elected leaders

అదే సమయంలో సంపద సృష్టించి అందులో నుంచి కొంత పంపిణీ చేయాలన్నారు. సంపద సృష్టించే వాతావరణం సమజాంలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసారు. సంపద సృష్టికి ప్రభుత్వాలే సహకరించకపోతే పంచటానికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందని వ్యాఖ్యానించారు.

ఇక, ఇప్పుడుఎక్కడా ఎవరి పేర్లు.. పార్టీలు..రాష్ట్రం గురించి ప్రస్తావన చేయకుండానే ప్రశాంత్ కిశోర్ కొన్ని కామెంట్స్ చేసారు. తాను గతంలో కొన్ని రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వారిని గెలిపించేందుకు తన బాధ్యత తాను నిర్వహించానని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఆభీష్టం మేరకు ఆ ప్రభుత్వాలు వ్యవహరించకపోతే..వారి గెలుపుకు సహకరించిన తనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనిని ఏపీలోని రాజకీయగా ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, ప్రశాంత్ కిశోర్ ఎక్కడా ఏపీ గురించి ప్రస్తావన చేసినట్లుగా లేదు. అదే సమయంలో పలు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిశోర్ ఆ పార్టీలు అధికారంలోకి రావటానికి పని చేసారు.

2019 ఎన్నికల సమయంలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్త గా ప్రశాంత్ కిశోర్ వ్యవహరించారు. వ్యూహాలతో పాటుగా పథకాల ప్రకటన విషయంలోనూ సూచనలు సలహాలు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రశాంత్ కిశోర్ రాజకీయంగా వైసీపీకి దూరమయ్యారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో టీఎంసీ, డీఎంకే కోసం రాజకీయ వ్యూహకర్తగా పని చేసారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ మమతా, స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఒక రాజకీయ వ్యూహకర్తగా కొనసాగటం లేదని ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. పూర్తిగా బీహార్ రాజకీయాలకే ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ పరిమితం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+