వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ కోసం ప్ర‌శాంత్ కిషోర్ ఐప్యాక్ స‌రికొత్త వ్యూహం?

|
Google Oneindia TeluguNews

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రెండోసారి కూడా విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డానికి ప్ర‌శాంత్ కిషోర్ సార‌థ్యంలోని ఐప్యాక్ సంస్థ నిరంత‌రం ప‌నిచేస్తోంది. వ్యక్తిగతంగా పీకే పనిచేయనప్పటికీ ఆయన సహచరుడు రుషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా స‌ర్వేలు నిర్వ‌హిస్తూ నివేదిక‌లు అంద‌జేస్తోంది. లోటుపాట్లు ఎక్క‌డున్నాయో స‌రిచేసుకోవ‌డానికి సూచ‌న‌లు, స‌ల‌హాలు అంద‌జేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీని గెలిపించ‌డానికి సోష‌ల్ మీడియాను ఆయుధంగా ఉప‌యోగించింది ఐప్యాక్‌. ఈసారి కూడా సోష‌ల్ మీడియానే ఉప‌యోగించ‌బోతోంది.

 మహిళలతై కలిసొచ్చే అంశమని..

మహిళలతై కలిసొచ్చే అంశమని..


కాక‌పోతే ఇందులో కొత్త‌గా మార్పులు తెస్తోంది. సోష‌ల్ మీడియా విభాగంలో ప‌నిచేసేందుకు మ‌హిళ‌ల‌నే ఎక్కువ‌గా నియ‌మించుకుంటోంది. వీరికి చ‌ట్ట‌ప‌రంగా ర‌క్ష‌ణ ఉండ‌టం క‌లిసొచ్చే అంశ‌మ‌ని భావిస్తోంది. ప్ర‌త్య‌ర్థుల నుంచి వ‌చ్చే విమ‌ర్శ‌లు, పోస్టులు వీరిని కించ‌ప‌రిచేలా ఉంటే వారిపై కేసులు న‌మోదు చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని, విప‌క్షాలెవ‌రైనా తీవ్ర‌మైన పోస్టుల‌తో ఎటాక్ చేసినా మ‌హిళ‌లపై దాడిచేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అనే అంశంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌వ‌చ్చ‌ని ఐప్యాక్ వ్యూహాన్ని రచిస్తోంది.

 విమర్శలను ధీటుగా తిప్పికొడతారని..

విమర్శలను ధీటుగా తిప్పికొడతారని..

పురుషులక‌న్నా మ‌హిళ‌లు ఏదైనా చెబితే ప్ర‌జ‌లు శ్ర‌ద్ధ‌గా వింటారు.. వారి బుర్ర‌ల్లోకి సులువుగా నాటుకుంటుంది. అంతేకాదు మ‌హిళల పోస్టింగ్స్ అంటే అంద‌రూ ఆస‌క్తిగా చూస్తారు. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ చేసే మంచి ప‌నులను వీరు వివ‌రించి చెబుతార‌ని, వినేవారు కూడా శ్ర‌ద్ధ‌గా వింటార‌ని, అంతేకాకుండా ప్ర‌తిప‌క్షం నుంచి వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను ధీటుగా తిప్పికొడ‌తార‌నేది ఐప్యాక్ ప్ర‌ణాళిక‌గా ఉంది.

 రాజకీయ నినాదాన్ని రూపొందించే పనిలో..

రాజకీయ నినాదాన్ని రూపొందించే పనిలో..

గ‌త ఎన్నిక‌ల్లో కావాలి జ‌గ‌న్‌.. రావాలి జ‌గ‌న్‌.. అన్న అర్థ‌వంత‌మైన నినాదాన్ని అందించిన ఐప్యాక్ ఈసారి కూడా మ‌రో నినాదాన్ని త‌యారుచేసే ప‌నిలో ఉంది. రాజ‌కీయ నినాదాం కాబ‌ట్టి అది ప్ర‌జాబాహుళ్యంలోకి చొచ్చుకెళ్లాలంటే వీటిని తీసుకువెళ్లే సార‌థులుగా మ‌హిళ‌లైతేనే స‌రి అని భావిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌పై నివేదిక‌లు అందించ‌డంతోపాటు కొత్త‌గా నినాదాలు రూపొందిస్తూ ఈసారి ఎన్నిక‌ల్లో వైసీపీని గెలిపించ‌డానికి ఐప్యాక్ ఇప్ప‌టినుంచే విశేషంగా కృషిచేస్తోంది.

English summary
The IPAC organization headed by Prashant Kishore is continuously working to bring the YSR Congress party to victory for the second time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X