దేశ వ్యాప్తంగా ప్రార్ధనలు: హనుమంతప్ప కోలుకోవాలంటూ జగన్, సచిన్, బిగ్‌బి ట్వీట్స్

అమరావతి: సియాచిన్ ఘటనలో కొండ చరియల కింద ఆరు రోజుల పాటు సజీవంగా బయటపడిన కర్ణాటకకు చెందిన ఆర్మీ జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ట్వీట్టర్‌లో తమ సందేశాన్ని పోస్టు చేశారు.

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు "సియాచిన్ మంచు తుపాను నుంచి మృత్యుంజయుడైన లాన్స్ నాయక్ హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా" అంటూ ఆయన ట్విట్ చేశారు.

Prayers for the speedy recovery and long life of the survivor Lance Naik Hanumanthappa

ప్రస్తుతం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను కోమాలో ఉన్నాడు. ఆయన పరిస్థితి ప్రస్తుతం తీవ్ర ఆందోళనకరంగా ఉందని.. ఆయన కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతిందని, వెంటిలేటర్‌పై ఉన్నారని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.

అదృష్టవశాత్తూ ఆయన అవయవాలు ఫ్రాస్ట్‌ బైట్‌కు (మంచు వల్ల మొద్దుబారిపోవడం) గురి కాలేదని, ఇతరత్రా ఎలాంటి గాయాలు కూడా కాలేదని వివరించింది. మరో 24 గంటల నుంచి 48 గంటల గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. మరోవైపు హనుమంతప్ప కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+