వింత పూజ: ఒంటిపై తేళ్లను పాకించుకుంటారు
హైదరాబద్: వందలాది మంది భక్తులు ఒంటిపై తేళ్లను ఒంటిపై పాకించుకుంటూ భక్తిపారవశ్యంతో మునిగిపోయే సంఘటన గురించి ఆంధ్రభూమి తెలుగు దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. గుండుపై తేళ్లను పాకింటుకుంటున్న ఓ భక్తును ఫొటోను కూడా ఆ పత్రిక ప్రచురించింది.

ఆ పత్రిక వార్తాకథనం ప్రకారం - కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణ శివారులోని కొండపై వెలిసిన కొండరాయుడుకు శ్రావణమాసంలో భక్తులు తేళ్లతో పూజలు చేస్తారు. మూడవ సోమవారం పెద్దసంఖ్యలో కొండపైకి చేరుకునే భక్తులు అక్కడి రాళ్ల కింద ఉండే తేళ్లను పట్టుకుని స్వామివారి మూలవిరాట్‌పై వేసి పూజలు చేశారు.
అనంతరం వాటిని తమ ఒంటిపై వేసుకుని భక్త్భివాన్ని చాటుకున్నారు. ఈరోజు కొండపై కనిపించిన తేళ్లను పట్టుకున్నా కుట్టవని, ఒకవేళ కుట్టినా విషం ఎక్కదని, ఇదే ఇక్కడి మహత్యమని భక్తుల విశ్వాసమని ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications