టీడీపీకి షాకిచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు: ఆ ప్రకటనలతో సంబంధం లేదంటూ

అమరావతి: జగన్ సర్కార్-ప్రభుత్వ ఉద్యోగుల మధ్య తలెత్తిన పీఆర్సీ వివాదం సద్దుమణగట్లేదు. పీఆర్సీని అమలు చేసేలా జారీ చేసిన జీవోలను మంత్రివర్గం ఆమోదించడంతో ఇది కాస్తా మరింత ముదిరినట్టయింది. ఏ మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు దశల వారీగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. వాటిని అమలు చేస్తోన్నారు. ఈ కార్యాచరణలో భాగంగా ఇవ్వాళ రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించనున్నారు.

 టీడీపీ నుంచి అనుకూల ప్రకటనలు..

టీడీపీ నుంచి అనుకూల ప్రకటనలు..

ఎల్లుండి మరోసారి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. వచ్చేనెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. ఉద్యోగుల జేఏసీకి తలపెట్టిన ఈ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది. ఉద్యోగుల ఆందోళనలు, సమావేశాలు, ధర్నాలను ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేస్తోన్నారు. వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తోన్నారు. టీడీపీ మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు సైతం- తాము ఉద్యోగుల ఆందోళనలకు అండగా ఉంటున్నామనీ స్పష్టం చేశారు.

రాజకీయ జోక్యం కోరట్లేదు..

రాజకీయ జోక్యం కోరట్లేదు..

టీడీపీ నాయకలు చేసిన ఈ ప్రకటనల పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నారు. టీడీపీ సహా తాము ఏ రాజకీయ పార్టీ మద్దతును అర్థించట్లేదని తేల్చి చెప్పారు. తాము ఏ పార్టీని కూడా ఆశ్రయించట్లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం-ఉద్యోగ సంఘాల మధ్య నెలకొన్న అంశంగా మాత్రమే దీన్ని పరిగణించాల్సి ఉంటుందని వారు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందులో మరే ఇతర ఏ రాజకీయ పార్టీ జోక్యం ఉండబోదని తేల్చి చెప్పారు.

ఏ పార్టీని ఆశ్రయించలేదు..

ఏ పార్టీని ఆశ్రయించలేదు..

అలా ఏ పార్టీ అయినా ఆ అంశంలో జోక్యం చేసుకుంటే- అది రాజకీయ ప్రయోజనాల కోసమే అవుతుందని కుండబద్దలు కొట్టారు. సమాజంలో ఏ వర్గానికి చెందిన ప్రజలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలు చేసినా పార్టీలు మద్దతు తెలుపుతుంటాయని, అది వాటి రాజకీయ ప్రయోజనం కోసమేనని వ్యాఖ్యానించారు. పీఆర్సీ కోసం పోరాటం చేస్తోన్న తాము తెలుగుదేశం పార్టీని ఆశ్రయించలేదని తేల్చి చెప్పారు.

 చంద్రబాబు మద్దతును అడిగామా?

చంద్రబాబు మద్దతును అడిగామా?

ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు గానీ, నాయకులు గానీ ఇచ్చే ప్రకటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పీఆర్సీకి వ్యతిరేకంగా తాము చేస్తోన్న ఆందోళనలు, పోరాటాలు, ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలకు మద్దతు ఇవ్వాలని తాము తెలుగుదేశం పార్టీని అడగలేదని జేఏసీ నాయకులు మరోసారి వివరణ ఇచ్చారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని కలిసి, తాము మద్దతు కోరలేదని స్పష్టం చేశారు.

ఆ ప్రకటనలతో సంబంధం లేదు..

ఆ ప్రకటనలతో సంబంధం లేదు..

అందుకే- ఇలాంటి ప్రకటనలు ఇచ్చేటప్పుడు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కూడా రాజకీయ నాయకుడే అయినందున- ఆయన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. పీఆర్సీ మీద లేదా తాము చేస్తోన్న ఉద్యమాలు, నిర్వహిస్తోన్న ఉద్యమ కార్యాచరణ ప్రణాళికపైనా టీడీపీ నుంచి లేదా ఏ ఇతర రాజకీయ పార్టీ నుంచి గానీ అనుకూలంగా ప్రకటనలు వస్తే.. వాటితో తమకు ఏ మాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు.

ఇదీ యాక్షన్ ప్లాన్..

ఇదీ యాక్షన్ ప్లాన్..

ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇదివరకే ప్రభుత్వానికి తమ సమ్మె నోటీసును అందజేశారు. ఇవ్వాళ రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించనున్నారు. ఎల్లుండి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 26వ తేదీన రాష్ట్రంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. 27 నుంచి 30వ తేదీ వరకు వర్క్ టు రూల్‌లోకి వెళ్లనున్నారు. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలో దిగనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+