రాజమండ్రిలో గెలుపెవరిదంటే..?
ఏపీలో కీలక లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజమండ్రి కూడా ఒకటి. రాష్ట్ర రాజకీయాల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వైజాగ్ తర్వాత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతం కావడంతో..అన్ని పార్టీలు కూడా ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నాయి. ఈ నియోజకవర్గంకు మే 13వ తేదీన విజయవంతంగా పోలింగ్ ముగియగా ఓటింగ్ 79.31 శాతంగా నమోదైంది
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 1,21,634 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి మొత్తంగా 5,82,024 ఓట్లు సాధించారు.మార్గాని భరత్ తన ప్రత్యర్థి టీడీపీకి చెందిన మాగంటి రూప పై విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీకి చెందిన మార్గాని భరత్ 582024 ఓట్లతో గెలుపొందగా, టీడీపీకి చెందిన మాగంటి రూపకు అనుకూలంగా 460390 ఓట్లు పోల్ అయ్యాయి.

మాగంటి రూప 121634 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 81.03 % మేరా పోలింగ్ జరిగింది. ప్రస్తుతం 2024 ఈ సారి ఎన్నికలు మరింత హోరాహోరీగా జరిగే అవకాశాలున్నాయి. 2024లో రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి శ్రీమతి డి. పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ నుంచి , గిడుగు రుద్రరాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి మరియు డాక్టర్ గూడూరి శ్రీనివాసులు వైసీపీ నుంచి బరిలో ఉన్నారు.
ప్రభుత్వం సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసులు ఆశిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమి తనని గెలిపిస్తాయని పురందేశ్వరి లెక్కలు వేసుకుంటున్నారు. మరి గెలుపు అంచనాల్లో ఎవరి అంచనాలు నిజం అవుతాయో జూన్ 4తో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications