శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డాక్టర్ల నిర్లక్ష్యంతో గర్భిణి కన్నుమూత

డాక్టర్ల నిర్లక్ష్యంతో గర్భిణి కన్నుమూత

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: కవల పిల్లలకు జన్మనివ్వాల్సిన నిండు గర్భిని వైద్యుల నిర్యక్ష్యం కారణంగా మృత్యువాత పడింది. సుఖ ప్రసవం కోసం వారం రోజుల క్రితం సర్కారీ ఆసుపత్రిలో చేరిన ఆమె చివరికి పిల్లలను కనకుండానే ప్రాణాలు విడిచిన ఘటన శ్రీకాకుళం జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రి లో చోటుచేసుకుంది. స్థానిక ప్రజలు తెలిపిన వివరాలు ప్రకారం జిల్లాలోని జి.సిగడాం మండలం గెడ్డ కంచరాం గ్రామానికి చెందిన పట్నాన గౌరి అనే గర్భిణీకి నెలలు నిండడంతో ప్రసవం కోసం రిమ్స్ ఆసుపత్రిలో గత నెల 30న చేర్పించారు. ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహించిన రిమ్స్ వైద్యులు... ఈ నెల 20వ తేదిన డెలివరీకి డేట్ ఇచ్చారు. అయితే ఆమె కడుపులో కవల పిల్లలు ఉండడంతో కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉంటే ఆపరేషన్ నిర్వహించి ప్రసవం చేస్తామని.., అటు ఇటు తిప్పడం ఎందుకని వైద్యులు సూచించారు. ఆ సూచనల మేరకు నిరుపేదలైన కుటుంబ సభ్యులు గౌరీని అక్కడే చేర్పించారు. అయితే....వైద్యులు ఆపరేషన్ నిర్వహించే విషయంలో ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చారు. గౌరికి బి.పి ఎక్కువగా ఉందని ఒకసారి... రక్తం చాలదని ఒకసారి... కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ.. చేయాల్సిన సిజేరియన్ అపరేషన్‌ ను వాయిదా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం అర్థరాత్రి గౌరికి తీవ్ర నోప్పులు రావడంతో ఆమె నరకయాతనను వైద్యల దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకేళ్లారు...ఆస్పత్రి వైద్య సిబ్బంది సకాలంలో స్పందించలేదు. బుధవారం తెల్లవారు జామున గౌరి కవల పిల్లలకు జన్మనివ్వకుండానే మృత్యువాతపడింది.

English summary
Pregnant lady dies in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X