గ్రహణం వేళ ఏమీ తినకూడదా?.. గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!!
మరి కొద్ది గంటల్లో చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. తిరుమల శ్రీవారి ఆలయంతో సహా పలు ప్రముఖ ఆలయాలను మూసివేస్తున్నారు. గ్రహణ సమయం పూర్తయ్యాక తిరిగి శాస్త్రోక్తంగా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన తరువాత మాత్రమే తిరిగి ఆలయాలలోకి భక్తులను అనుమతిస్తారు. కాగా, గ్రహణ సమయంలో ఏమీ తినకూడదనే నమ్మకం ఉంది. అదే విధంగా గర్భిణీలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు. అయితే, వీటి పైన పండితులు స్పష్టత ఇస్తున్నారు.
రేపు సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణం సంభవించిన సమయంలో భూమిపై నేరుగా అతి నీల లోహిత కిరణాలు పడుతాయి. ఈ కిరణాల ప్రభావం వల్ల మనకు కీడు కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ సమయంలో దేవాలయంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేవాలయాల్లోని విగ్రహాలు కూడా తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో దేవాలయాల తలుపులను పూర్తిగా మూసివేస్తారు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, గ్రహణాల సమయంలో సూర్య, చంద్రులు అసాధారణ ప్రతికూల శక్తిని విడుదల చేస్తారు. ఈ ప్రతికూల శక్తుల ప్రభావంతో ఆలయాల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీకి విఘాతం కలుగుతుంది. దీంతో, ప్రతికూల శక్తులను నిరోధించడానికి గ్రహణాల వేళ గుడి తలుపులను పూర్తిగా మూసి వేయడం అనాదిగా వస్తున్న ఆచారం.

గ్రహణం సంభవించినప్పుడు ఆ కిరణాల ప్రభావంతో మనం తినే ఆహారపదార్ధాలు కూడా విషతుల్యమవుతాయనే విశ్వాసం ఉంది. ఆ కిరణాల ప్రభావం వలన మానవుని జీర్ణశక్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది కాబట్టి గ్రహణం మొదలు కావడానికి మూడు గంటల ముందే ఆహారం తీసుకోవాలని పెద్దలు సూచిస్తారు. తద్వారా గ్రహణం మొదలయ్యే సమయానికి మనం తిన్న ఆహారం జీర్ణమయిపోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని పెద్దలు ఇలాంటి నియమం పెట్టారు. అయితే ఎందుకు గరిక, దర్భలు వేయాలంటే చెడు కిరణాల ప్రభావం వీటిపై ఏ మాత్రం ఉండదని చెబుతారు. ఇక, గ్రహణ సమయంలో గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు. మన పెద్దలు గ్రహణ సమయంలో ఆ కిరణాలు తగలకుండా గర్భిణీలు గ్రహణం పూర్తయ్యే వరకు చీకటి గదిలో ఉంచేవారు.
చంద్ర గ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుంద ని, ఏమీ తినకూడదని, గోళ్ళు గిల్లుకోకూడదని పూర్వం నుండి భారతదేశంలో నమ్మకం ఉంది. శాస్త్రీయంగా చూస్తే కడుపులో ఉన్న శిశువు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి చెడు కిరణాల ప్రభావం తగలకుండా ఉండడానికే మన పెద్దలు గర్భిణీ స్త్రీల విషయంలో ఈ నిబంధనలు ఏర్పాటు చేసారు. అయితే, దీని వెనుక అద్భుతమైన శాస్త్రీయ కోణం దాగి ఉంది. ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్ర గ్రహణం వేళ విడుదలయ్యే అతి గాఢమైన కిరణాల నుంచి ముప్పు ఉందని తెలుస్తోంది. అందుకే ఆ కిరణాల నుంచి రక్షణ కోసమే పెద్దలు ఈ నియమాలు ఏర్పాటు చేసి ఉంటారని చెబుతున్నారు. కాగా.. సైన్స్ ను నమ్మే వారు మాత్రం ఈ నియమాలు.. వాదనతో విభేదిస్తారు. దీంతో.. ఎవరి విశ్వాసం మేరకు వారు వ్యవహరిస్తారు.












Click it and Unblock the Notifications