వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌకలో రాష్ట్రపతి - విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ : ఆకాశంలో విన్యాసాలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

విశాఖ సాగర తీరంలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ ప్రారంభమైంది. సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఇందులో పాల్గొన్నారు. ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌకలో ప్రయాణిస్తూ రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నారు. భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీరామ్‌నాథ్‌ కోవింద్​కు సెల్యూట్‌ చేస్తూ చేస్తున్న విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ విన్యాసాల్లో 10 వేలమందికి పైగా నావికా సిబ్బంది పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 12వ ఎడిషన్ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ విశాఖపట్నంలో జరుగుతోంది.

Recommended Video

Indian Naval Fleet : INS Sumitra నౌకలో రాష్ట్రపతి..విశేషంగా ఆకట్టుకున్న విన్యాసాలు | Oneindia Telugu

ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో రాష్ట్రపతి 21-గన్-సెల్యూట్ అందుకున్నారు. అంతకుముందు నేవల్ డాక్‌యార్డ్‌కు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ అందించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. 60 యుద్ధనౌకలతోపాటు సబ్ మెరైన్స్‌, 50కిపైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి. దీనిలో భాగంగా భారత నౌకాదళ శక్తి సామార్థ్యాలను రాష్ట్రపత్రి రామ్‌నాథ్ సమీక్షిస్తున్నారు. మిలన్‌-2022 పేరుతో జరిగే నౌకాదళ విన్యాసాల్లో మొత్తం 44 యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలు జాతీయ ఓషణోగ్రఫీకి చెందిన నౌకలు పాల్గొన్నాయి.

President Ram Nath Kovind reviews the Indian Naval Fleet comprising over 60 ships and submarines

జలాంతర్గాములు, అత్యాధునిక నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు భాగం పంచుకున్నాయి. వీటితో పాటుగా .ఇటీవలే నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్​ విశాఖపట్నం, ఐ.ఎన్‌.ఎస్‌. వేలా జలాంతర్గామి, ఐ.ఎన్‌.ఎస్‌. చెన్నై, ఐ.ఎన్‌.ఎస్‌. దిల్లీ, ఐ.ఎన్‌.ఎస్‌. తేజ్‌, శివాలిక్‌ శ్రేణి యుద్ధనౌకలు మూడు, కమోర్తా యుద్ధనౌకలు మూడు, కోస్ట్‌గార్డ్‌, ఎన్‌.ఐ.ఒ.టి., షిప్పింగ్‌ కార్పొరేషన్‌కు చెందిన నౌకలు పీఎఫ్‌ఆర్‌లో పాల్గొన్నాయి. చేతక్‌, ఏఎల్‌హెచ్‌., సీకింగ్‌, కమోవ్‌ హెలికాప్టర్లు, డోర్నియర్‌, ఐ.ఎల్‌.-38ఎస్‌.డి., పి8ఐ, హాక్‌, మిగ్‌ 29కే యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో సముద్రం మధ్యన విన్యాసాలు చేస్తున్నాయి. సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా, ప్రతి భారత రాష్ట్రపతి తన ఐదేళ్ల కాలంలో భారత నావికాదళాన్ని ఒకసారి సమీక్షిస్తారు. ఇందులో వివిధ దేశాల నావికాదళ విన్యాసాలు ఆకట్టుకుంటాయి. మార్చి 4 వరకూ జరిగే ఈ విన్యాసాల్లో 46కి పైగా దేశాల నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి..

English summary
The 12th edition of President’s Fleet Review is being conducted at Visakhapatnam as part of Azadi Ka Amrit Mahotsav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X