విజయవాడ బ్రదర్స్ లో గెలుపెవరిది..!!
ఏపీ ఎన్నికల్లో కీలక సమయం వచ్చేసింది. హోరా హోరీగా ఎన్నికల సమరం కొనసాగుతోంది. పోలింగ్ కు ముందు చివరి 36 గంటలు కీలకంగా మారుతోంది. గెలుపు పైన ప్రధాన పార్టీల అధినేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ సీటులో పోరాటం ఉత్కంఠ పెంచుతోంది. కేశినేని బ్రదర్స్ లో ఎవరు గెలుస్తారనే దాని పైన బెట్టింగ్ లు కొనసాగుతున్నాయి. ప్రచారం పూర్తయిన వేళ ఇక్కడ గెలుపు పై మరింత ఆసక్తి కనిపిస్తోంది.
హోరా హోరీ పోరు
విజయవాడ బరిలో వైసీపీ నుంచి కేశినేని నాని..టీడీపీ నుంచి కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు. ఇద్దరూ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీడీపీ కంచుకోటగా చెప్పుకొనే విజయవాడ నుంచి కేశినేని నాని వరుసగా 2014, 2019 లో ఎంపీగా గెలుపొందారు.

ఇప్పుడు అదే నియోజకవర్గంలో వైసీపీ నుంచి బరిలో నిలిచారు. అనూహ్యంగా ఆయన సోదరుడు కేశినేని చిన్నిటీడీపీ అభ్యర్దిగా ప్రత్యర్ధిగా మారారు. ఇద్దరూ ఇప్పటి వరకు ఒకరిపైన మరొకరు తీవ్ర విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ప్రచారంలోనూ ఇద్దరూ పోటీ పడ్డారు. గెలుపు పైన ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మారుతున్న లెక్కలు
అయితే, ఈ ఎన్నికల్లో నాని వర్సస్ చిన్ని పోరులో అనేక ఆసక్తి కర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో గత ఎన్నికల్లో టీడీపీ ఒక్క స్థానమే గెలిచింది. తిరిగి అదే పట్టు కొనసాగించాలని భావిస్తోంది. కానీ, సమీకరణాలు మారుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో నారా లోకేష్ యువగళం నుంచి కేశినేని చిన్ని పార్టీలో మరింత యాక్టివ్ గా మారారు.
టీడీపీ ఎంపీ సీటు ప్రకటన తరువాత ముందుగా పార్టీలో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కొందరు అభ్యర్దుల నుంచి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకున్నారు. పార్టీ అధినాయకత్వం అండగా నిలవటం చిన్ని కి అదనపు బలంగా మారింది. ఇక ప్రధాని మోదీ ప్రచారం, పవన్ కళ్యాణ్ చిన్నికి మద్దతుగా క్యాంపెయినింగ్ చేయడం వంటి అంశాలన్నీ కేశినేని చిన్నికి కలిసొచ్చే అంశాలుగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ అధినాయకత్వానికి ప్రచారం..మారుతున్న లెక్కల గురించి వివరిస్తున్నారు.
బ్రదర్స్ లో గెలుపెవరిది
అటు.. కేశినాని వైసీపీలో కొత్త కావటంలో ప్రచారంలో కొన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో సహకారం అందటం లేదనే అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యేలతో ప్రచారం తప్ప నాని ఒంటరిగా ఎక్కువగా ప్రచారం చేయలేదనే మాట సైతం వినిపిస్తోంది. మూడు పార్టీల నేతలను సమన్వయం చేసుకుంటూ పార్లమెంట్ పరిధిలో ప్రతీ నియోజకవర్గంలో మెజార్టీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని చిన్ని చెబుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజవర్గంలో సీటు ఆశించి భంగపడిన వారు పార్టీ మారేందుకు ఆలోచేన చేస్తుండగా..వారిని వారించటంలో చిన్ని సక్సెస్ అయ్యారు.
ఇక.. పార్లమెంట్ పరిధిలో టీడీపీకి ఉన్న బలమైన ఓట్ బ్యాంక్..మిత్రపక్షాల ఓటింగ్ కలిసి రావటంతో గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పైన ఆరోపణలు చేస్తున్న నానికి ఎన్నికల్లో ఓట్లతోనే సమాధానం వస్తుందని చెబుతున్నారు.దీంతో.. విజయవాడ ఎంపీ స్థానంలో గెలుపు పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications