వందే భారత్ రైళ్లపై నరేంద్రమోడీ సంచలన నిర్ణయం

మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తూ సరికొత్త మోడల్స్ లో రైళ్లను పరిచయం చేస్తోంది. వీటిల్లో భాగంగా వచ్చినవే వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు. వీటితర్వాత నగరాలు, పట్టణాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు వందేభారత్ మెట్రో పేరుతో రైళ్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్.. కపుర్తలా లోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఈ సంవత్సరం చివర్లో వందే భారత్ మెట్రో రైళ్లు రాబోతున్నాయి. ట్రయల్ రన్ కోసం ఇవి సిద్ధంగా ఉన్నాయి.

16 బోగీలకు పెంచుకోవచ్చు
వందేభారత్ మెట్రో రైళ్లకు మొత్తం 12 బోగీలు ఉంటాయి. అవసరమైతే 16 బోగీలకు పెంచుకోవచ్చు. రద్దీని బట్టి నిర్ణయం తీసుకుంటారు. దేశంలో నగరాలు, పట్టణాలు వేగంగా పెరుగుతున్నాయి. వీటిమధ్య దూరాన్ని తక్కువ సమయంలో అధిగమించేందుకు మెట్రో ఉపయోగపడుతోంది. ప్రొటోటైప్ ఆమోదించిన తర్వాత మొదటి రెండు సంవత్సరాల్లో 50 వందే భారత్ మెట్రో రైళ్లు రానున్నాయి.

prime minister narendra modi sensational decision on vande bharat trains

400 మెట్రో తయారీ
ప్రస్తుతం యూరప్, దక్షిణ కొరియా, చైనా, కెనడాలో ఇలాంటి మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా మనదేశం కూడా ఈ జాబితాలో చేరబోతోంది. ఇప్పటివరకు భారతదేశంలో మెట్రో రైళ్లను విదేశీ కంపెనీలు తయారుచేసేవి. కొన్ని మాత్రం మనదేశంలోనే తయారైనప్పటికీ టెక్నాలజీ మాత్రం విదేశాలదే. వందే భారత్ మెట్రో రైళ్లు మాత్రం పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 400 వందల మెట్రో రైళ్ల కోసం భారతీయ రైల్వే ఆర్డర్లు ఇవ్వబోతోంది.

రూ.50వేల కోట్ల పెట్టుబడి
రైళ్లు తయారుచేసే కోచ్ ఫ్యాక్టరీల్లో వచ్చే కొన్ని సంవత్సరాల్లో రూ.50వేల కోట్ల పెట్టుబడిని ఇండియన్ రైల్వే పెట్టబోతోంది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకు రైల్వేకు సంబంధించి నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూస్తున్నారు. 12 కోచ్ లు ఉన్న వందే భారత్ మెట్రో తయారీకి రూ.100 నుంచి రూ.120 కోట్లు ఖర్చవుతుంది. విదేశాల్లో అయితే రూ.400 కోట్లు అవుతుంది. మనదేశంలో తయారవబోతున్న మెట్రో రైళ్లు ప్రపంచంలోనే అత్యంత చవకైన రైళ్లుగా ప్రసిద్దికెక్కబోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+