మోడీ స్కీం, గల్లా సూచన: బుర్రిపాలెంని దత్తత తీసుకోనున్న మహేష్ బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోగల బుర్రిపాలెం గ్రామాన్ని తాను త్వరలో దత్తత తీసుకుంటానని ప్రిన్సి మహేష్ బాబు ఆదివారం ప్రకటించారు. ప్రముఖులు వారి వారి గ్రామాలను దత్తత తీసుకోవాలని, అభివృద్ధి చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవల మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాలో అదే పాయింట్ ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ జన్మించిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. శ్రీమంతుడు చిత్ర యూనిట్ నేడు సినిమా విజయవంతంపై సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడారు. తమ సొంతూరైన బుర్రిపాలెం గ్రామాన్ని త్వరలో దత్తత తీసుకుంటానని చెప్పారు. బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని షూటింగ్ సమయంలో తన బావ, ఎంపీ గల్లా జయదేవ్ సూచించారన్నారు. బుర్రిపాలెం దత్తత విషయమై చర్చించామని చెప్పారు.
కాగా, ప్రధాని మోడీ పిలుపు మేరకు పలువురు పారిశ్రామికవేత్తలు, సినిమా తారలు, ఎంపీలు, మంత్రులు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications