స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: అంబటి రాంబాబుపై ప్రివిలేజ్ మోషన్
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబుపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టారు.
హైదరాబాద్: ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబుపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టారు. ఈ అంశాన్ని సభలో చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రస్తావించారు.
అంబటిపై శాసనసభలో సభా ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. 168 నిబంధన కింద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యాంగబద్ధమైన సభాపతి స్థానాన్ని కించపరిచేలా అంబటి వ్యాఖ్యానించారన్నారు.

స్పీకర్‌ను కించపరిస్తే సభను అవమానించినట్లే భావించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడారు. స్పీకర్ స్థానం తన జీవితంలో గొప్ప అదృష్టమన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధ కలిగించిందన్నారు. స్పీకర్ స్థానాన్ని విమర్శించడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications