వైఎస్ షర్మిలకు ప్రియాంక ఫోన్, ఆఫర్ - టార్గెట్ జగన్ వయా కేసీఆర్..!?

కాంగ్రెస్ హైకమాండ్ రాజకీయ పావులు కదుపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్..జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. వైఎస్ షర్మిల కేంద్రంగా కొద్ది రోజులు తెలంగాణలో కొత్త రాజకీయం మొదలైంది. షర్మిలతో నేరుగా ప్రియాంక గాంధీ టచ్ లోకి వచ్చారు. సుదీర్ఘ మంతనాలు జరిగాయి. ఏపీ..తెలంగాణలో షర్మిల పాత్ర పైన క్లారిటీ ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కర్ణాటక నూతన డిప్యూట సీఎం డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. భవిష్యత్ ప్లాన్ ప్రతిపాదించారు.

ప్రియాంక కీలక ప్రతిపాదన: తాజాగా కాంగ్రెస్ ను తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని షర్మిల చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనకు మిస్డ్‌కాల్స్‌ వస్తున్నాయి కానీ, ఆ కాల్స్‌కు తాను ఆన్సర్‌ చేయలేదని షర్మిల చెప్పుకొచ్చారు. ఏదైనా నిర్ణయం ఉంటే ఓపెన్ గానే చెబుతానని స్పష్టం చేసారు. తాను మరో పార్టీలో విలీనం చేసేందుకు తన పార్టీ పెట్టలేదని తేల్చి చెప్పారు. అయితే, ప్రియాంక గాంధీ తాజాగా షర్మిలతో ఫోన్ లో సుదీర్ఘంగా సంప్ర దింపులు జరిపారు. షర్మిల - ప్రియాంక మధ్య డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం వ్యవహరించారు. డీకే శివకుమార్ తో షర్మిల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అవి తాజా పరిణామాలకు కీలకంగా మారాయి.షర్మిలను కాంగ్రెస్‌ పార్టీ వైపు ఆకర్షించడానికి డీకే తన వంతు కృషి చేశారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఆ పార్టీ నుంచి ప్రతిపాదన వచ్చినప్పటికీ షర్మిల అంగీకరించలేదు.

Priyanka Gandhi

తెలంగాణ టు ఏపీ: షర్మిలను తమతో కలుపుకోవటం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ హైకమాండ్ అంచనా వేస్తోంది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం, వైఎస్సార్ ఇమేజ్ ఆధారంగా షర్మిల ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యారు. కాంగ్రెస్ కు దక్కాల్సిన ఈ ఓటింగ్ చీలకుండా షర్మిలను కూడా కలుపుకు పోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ విలీనానికి నిరాకరించటంతో పొత్తు దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రభావం చూపించగలిగితే ఆ తరువాత ఏపీలోనూ షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అంశం పైన ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. షర్మిల ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. షర్మిల అంగీకరిస్తే ముందుగా తెలంగాణలో ఎన్నికల్లో కలిసి పోటీ చేయటం లక్ష్యంగా కనిపిస్తోంది. షర్మిల అంగీకరించి కలిస్తే ఆ తరువాత ఏపీలోనూ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించటానికి సిద్దమని ప్రతిపాదన సారాంశంగా ప్రచారం సాగుతోంది.

Priyanka Gandhi

టార్గెట్ కేసీఆర్.. నెక్స్ట్ జగన్: ఏపీలో కాంగ్రెస్ పార్టీ కొత్త లెక్కలతో సిద్దం అవుతోంది. జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లొ జగన్ ను ఓడిస్తేనే తిరిగి కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తోంది. ఏపీలో ప్రాంతీయ పార్టీల బలం ముందు బీజేపీ బలపడటం సాధ్యం కాదనే అభిప్రాయంతో కాంగ్రెస్ ఉంది. సీఎం జగన్ తమ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకున్నారనే ఆగ్రహంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. దీంతో, వైఎస్ కుమార్తెగా షర్మిల అంగీకరిస్తే పార్టీ బాధ్యతలు అప్పగించానే ఉద్దేశంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో షర్మిల తమ ప్రతిపాదనకు అంగీకరించి ముందుకు వస్తే ముందుగా తెలంగాణ..ఆ తరువాత ఏపీ టార్గెట్ గా కాంగ్రెస్ ఆపరేషన్ కు సిద్దం అవుతోంది. దీంతో, షర్మిల నిర్ణయం ఇప్పుడు కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+