కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ ఘర్షణ, విధ్వంసం, ‘మహిళా కౌన్సిలర్‌పై దాడి’

ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి వీరంగం సృష్టించారు. ఎంపీ సీఎం రమేష్,

|
Google Oneindia TeluguNews

కడప: ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి వీరంగం సృష్టించారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డి వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

ఎన్నికలు వాయిదా వేయాలంటూ టీడీపీ కౌన్సిలర్లు కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అనంతరం మినిట్స్ బుక్‌ను ఓ టీడీపీ కౌన్సిలర్ లాక్కెళ్లారు. అతడ్ని వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు, పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ కౌన్సిలర్ పుల్లయ్య వద్ద నుంచి పోలీసులు మినిట్స్ బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్బంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకానొక దశలో టీడీపీ కార్యకర్తలు పోలీసు జీపుపై రాళ్లురువ్వారు. కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో పరిస్థితిని గమనించిన జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికను ఆదివారాకి వాయిదా వేశారు.

Proddatur municipal chairman election postponed to Sunday

కాగా, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారమే విప్ జారీ చేసింది. దీంతో గతంలో టీడీపీకి మద్దతు పలికిన కౌన్సిలర్లు.. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, రేపటికి వాయిదా పడిన ఎన్నికలు రేపు కూడా జరుగుతాయో లేదోనని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, సమావేశం నిర్వహించాలంటే మొత్తం 41మందిలో 21మంది కావాల్సి ఉంటుంది. వారిలో ఏ ఒక్కరు హాజరుకాకపోయినా ఎన్నికను వాయిదా వేయాల్సి ఉంటుంది. ఆదివారం కూడా కోరం లేకపోతే తిరిగి ఎన్నికల కమిషనర్‌కు తెలిపి తదుపరి వచ్చే నోటిఫికేషన్ వరూ ఆగాల్సి ఉంది.

అరాచకం, మహిళా కౌన్సిలర్‌పై దాడి : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి

మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతలు, కౌన్సిలర్లు అరాచకం సృష్టించారిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి అన్నారు. తమ పార్టీ నుంచి అభ్యర్థి ఛైర్మన్‌గా ఎన్నికవుతారనే టీడీపీ విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్లపై దాడి చేశారని అన్నారు.

అధికార పార్టీ సభ్యులు కొట్టారు, తిట్టారని చెప్పారు. ఆర్డీఓపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారని అన్నారు. ఎమ్మెల్సీ సీటును దక్కించుకున్న విధంగానే.. ఎలాగైనా ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి కూడా దక్కించుకోవాలని టీడీపీ కుటిల ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

English summary
Proddatur municipal chairman election postponed to Sunday due to TDP, YCP leaders clash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X