సీఎం జగన్ ఒత్తిడి-తేల్చేసిన సురేష్ బాబు : విశాఖ స్టూడియో స్వాధీనం-జరిగిందిదీ..!!
కొద్ది రోజులుగా అటు పొలిటికల్ గా..ఇటు సినీ ఇండస్ట్రీలో ఒక ప్రచారం సాగుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు అక్కడ ఉన్న రామానాయుడు స్టూడియో పైన ఒక నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం సాగుతోంది. దీని పైన ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. అయితే, తాజాగా ఆ స్టూడియో అధినేత... దగ్గుబాటి సురేష్ బాబు అసలు విషయం తేల్చి చెప్పారు. నారప్ప సినిమా గురించి ఆయన మీడియాతో పలు అంశాలను షేర్ చేసుకున్నారు. అందులో భాగంగా..ఈ స్టూడియో అంశం పైనా స్పందించారు.

విశాఖలో భూములు మా కష్టార్జీతం..
విశాఖలో తాము మార్కెట్ ధర కంటే ఎక్కవగానే చెల్లించి భూమి కొనుగోలు చేసామని నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు. అక్కడ ఏర్పాటు చేసిన రామానాయుడు స్టూడియో తమ కుటుంబానికి చెందినదేనని..అందులో ప్రభుత్వం ఇచ్చిన భూమి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా తమ కుటుంబ కష్టార్జితంగా సురేష్ బాబు పేర్కొన్నారు. అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం కోసం రామానాయుడు స్టూడియో ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోందని వ్యాఖ్యానించిన సురేష్ బాబు..అదంతా నిరాధార ఆరోపణలు అంటూ కొట్టి పారేసారు.

సీఎం మనుషులు ఎవరూ సంప్రదించలేదు..
ఆ ప్రచారం అంతా అవాస్తమన్నారు. అదంతా మీడియానే సృష్టించిందని చెప్పుకొచ్చారు. తమ స్టూడియోకు సంబందించిన భూముల పైన ముఖ్యమంత్రి నుంచి..అదే విధంగా వైసీపీ నేతలు ఎవరి దగ్గరి నుంచి తమతో సంప్రదింపులు జరగలేదని...అసలు చర్చే లేనప్పుడు, ఒత్తిడి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అయితే, ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎక్కడి భూమి నైనా...సేకరించే హక్కు ఉంటుందని సురేష్ బాబు వ్యాఖ్యానించారు. కానీ, ప్రయివేటు భూములకు తగిన మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయ పడ్డారు.

విశాఖలో కంటిన్యూ అవుతాం..
తాము విశాఖలో స్టూడియోను భవిష్యత్ లోనూ నిర్వహిస్తాం..కొనసాగిస్తామంటూ సురేష్ బాబు తేల్చి చెప్పారు. కరోనా ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ పైన ఎక్కువగా పడింది. దీంతో..ఇప్పుడన్న పరిస్థితుల్లో స్టూడియో నిర్వహణ ఖర్చు భారం అవుతోంది. దీంతో...ఏపీ ప్రభుత్వం విశాఖలో సినీ ఇండస్ట్రీ భవిష్యత్ కు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో.. విశాఖలోని స్టూడియో పైన మరింత పెట్టుబడికి సైతం సురేష్ బాబు సిద్దం అవుతున్నట్లు సమాచారం.
ముందుగా ఏపీ ప్రభుత్వం నుంచి అందే సహకారం పైన స్పష్టత రాగానే సురేష్ బాబు ..అదే విధంగా ఆయన బాటలో మరి కొందరు ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సురేష్ బాబు ఈ అంశం పైన స్పష్టత ఇవ్వటంతో ఈ వివాదాస్పద అంశానికి ముగింపు కార్డు పడింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications