సీనియర్ జర్నలిస్టుకు ప్రభుత్వ సలహాదారు పదవి: ఉత్తర్వులు జారీ!
అమరావతి: ప్రముఖ జర్నలిస్టు జీవీడి కృష్ణమోహన్ ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్లు)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ దినపత్రికల్లో ఆయన జర్నలిస్టుగా పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైఎస్ఆర్ సీపీ మీడియా విభాగం ఇన్‌ఛార్జిగా చాలాకాలంగా పని చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీకి సంబంధించి విలేకరుల సమావేశాలను నిర్వహించడం, ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమైన వార్తలను క్రోడీకరించి వైఎస్ జగన్‌కు అందజేయడం వంటి కార్యకలాపాలను ఆయన నిర్వహించారు.

ప్రత్యేకించి- ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన మీడియా సహా గ్రామస్థాయిలో పార్టీ నాయకులను సమన్వయ పర్చడంలో కృష్ణమోహన్ విజయవంతం అయ్యారని చెబుతున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తుంచకుని.. ప్రభుత్వ సలహదారు (కమ్యూనికేషన్లు)గా నియమించారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.












Click it and Unblock the Notifications