వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే: చంద్రబాబుకు ఝలక్, ఆ క్రెడిట్ వైయస్‌దేనట...

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: పెన్షన్ల క్రెడిట్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కాకుండా దివంగత నేత వైయస్ రాజేశేఖర రెడ్డికే వెళ్తోంది. చంద్రబాబు పాలనపై సానుకూలత వ్యక్తమవుతున్నప్పటికీ శానససభ్యుల పనితీరుపై తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది.

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిన సందర్భంగా పార్టీ-ప్రభుత్వంపై జనాభిప్రాయాన్ని సేకరించే పనిలో తెలుగుదేశం పార్టీ పడింది. ఆ మేరకు గత పదిరోజుల నుంచి పార్టీ నెంబరు ఫోన్ల నుంచి వివిధ వర్గాల ప్రజల సెల్‌ఫోన్లకు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశ్నలు వస్తున్నాయి.ఎనిమిది ప్రశ్నలను అడుగుతున్న టిడిపి ఐటి బృందం అవన్నీ ఎమ్మెల్యేల పనితీరుతోనే ప్రజాభిప్రాయ సేకరణను ముడిపెట్టింది.

ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎవరికి ఓటు వేస్తారనే ప్రశ్న కూడా అందులో ఉంది.అయితే, ఈ ఫోన్లు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలకూ వస్తున్నాయని అంటున్నారు. నియోజకవర్గాలవారీగా ఫోన్ నెంబర్లు సేకరించిన ఐటి విభాగం, ఆయా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశ్నలు అడుగుతోంది. ప్రధానంగా ఎమ్మెల్యేల పనితీరు, అందుబాటులో ఉంటున్న వైనం, అవినీతి గురించి కూడా ప్రశ్నిస్తోంది.

Public opinion: The credit goes to YSR not to Chandrababu

దానితోపాటు ఒకవేళ ఇప్పుడున్న ఎమ్మెల్యే కాకపోతే మరొకరిని సూచించాలని కూడా అడుగుతోంది. చాలామంది తమకు వచ్చిన నెంబర్లు చూసి తిరిగి ఆ నెంబర్లకు ఫోన్ చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ పేరు వస్తోంది. ప్రభుత్వ సానుకూలత పార్టీకి అంతగా ఉపకరించదడ రావడం లేదని, అదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల్లో పార్టీ దెబ్బతింటుందనే ఆందోళన చంద్రబాబులో వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు.

పెన్షన్లపై అన్ని వర్గాల్లో సానుకూలత ఉన్నప్పటికీ అది ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోగా, నిరక్షరాస్యుల్లో వెయ్యి రూపాయలకు పెంచిన ఆ పెన్షన్లు ఇంకా రాజశేఖరరెడ్డి ఇస్తున్నారనే భావన నెలకొంది. ఇవన్నీ గమనించిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణకు పార్టీ మరింత ప్రాధాన్యం ఇస్తోంది.

అయితే 25-30 మంది ఎమ్మెల్యేలపై మాత్రం సదభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. తొలుత ప్రభుత్వ నిఘా వర్గాలు, తర్వాత పార్టీ ఐటి యంత్రాంగంతో సర్వే చేయించిన చంద్రబాబు, సత్ఫలితాలు సాధించిన ఎమ్మెల్యేలను పిలిపించి, వారితో మిగిలిన వారికి శిక్ష ఇప్పించేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నారు.

సగానికిపైగా శాసనసభ్యులపై, కొంత మంది మంత్రుల కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటినీ చక్కదిద్ది గాడిలో పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

English summary
It is said the public opinion on pension the credit is going to YS Rajasekhar Reddy not to Andhra Pradesh CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X