వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుణమాఫీకి రూ.5వేల కోట్లు: ఎపి వ్యవసాయ బడ్జెట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Pulla Rap proposes agriculture budget in assembly
హైదరాబాద్: పంట రుణాల మాఫీకి రూ. 5వేల కోట్ల రూపాయలు, విత్తన సరఫరా రాయితీకి రూ.212 కోట్లు, యాంత్రీకరణకు రూ.90 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. 2014 - 15కు గాను ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.వ్యవసాయ బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం రూ.6735 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ.6,373 కోట్లు అని ఆయన చెప్పారు.

పావలా వడ్డీకే రుణాలు

ఆంధ్రప్రదేశ్ రైతులకు రూ.3 లక్షల వరకు పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్చించిన రైతులకే పావలా వడ్డీ రుణం వర్తిస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత కొడిగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం తొలి స్థానంలో ఉందని చెప్పారు మాంసం ఉత్పత్తిలో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని పుల్లారావు చెప్పారు. పట్టు ఉత్పత్తిలో ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

రైతులకు 9 గంటలు విద్యుత్తు

రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషి చేయనున్నట్లు పత్తిపాటి పుల్లారావు చెప్పారు. మత్స్య ఉత్పత్తుల విలువలో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 4.04 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని, మత్స్య రంగానికి బడ్జెట్‌లో రూ.60.07 కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి చెప్పారు.

10 వేల సోలార్ పంపుసెట్లు

వచ్చే ఐదేళ్లలో పది వేల కొత్త సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక్రిశాట్ సేవలను వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వినియోగించుకుంటామని మంత్రి చెప్పారు భూసార ఆరోగ్యపత్రం ద్వారా రైతులకు భూసార ఫలితాలు తెలియజేసి అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యానవన, పశుసంవర్ధక, అటవీ, పట్టు, మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా రాష్ట్ర స్థూల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

పావలా వడ్డీకి రూ.230 కోట్లు

ఉత్పాదక పెంపుదలకు రూ.153.23 కోట్లు

వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ.192 కోట్లు

పట్టు పరిశ్రమకు రూ. 122 కోట్లు

సమగ్ర ఉద్యానవన అభివృద్ధికి రూ.34 కోట్లు

ఉద్యానవన విశ్వవిద్యాలయానికి రూ.30 కోట్లు

రైతుల ఉచిత విద్యుత్తుకు రూ.3,188 కోట్లు

సహకార శాఖరు రూ.156 కోట్లు

వ్యవసాయంతో ఉపాధఇ హామీ ఇనుసంధానానికి రూ.1,388 కోట్లు

వెంకటేశ్వర పశు విద్య విశ్వవిద్యాలయానికి రూ.112 కోట్లు

పశు సంవర్ధక శాఖకు రూ. 723 కోట్లు

పశుగణ అధునాతన పరిశోధన కేంద్రానికి రూ.15 కోట్లు

English summary
Andhra Pradesh agriculture minister Pattipati Pulla Rao has presented agriculture budget for the year 2014-15 in assembly today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X