Bhagwant Mann: నాలుగు రోజులుగా విశాఖలోనే పంజాబ్ సీఎం భగవంత్ మాన్..
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గత నాలుగు రోజులుగా విశాఖపట్నంలోనే ఉన్నారు. ఆయన విశాఖపట్నంలో నాలుగు రోజులుగా ఉండడం ఏమిటి. ఆయన అస్సలు విశాఖపట్నం ఎందుకు వచ్చారు. నాలుగు రోజులుగా ఏం చేస్తున్నారు. అని మీకు డౌట్ రావొచ్చు. భగవంత్ మాన్ ఆంధ్రప్రదేశ్ కు అధికారిక పని మీద రాలేదు. అయినప్పటికీ నాలుగు రోజులు ఇక్కడే ఉండడానికి కారణం.. ఆయన వెల్ నెస్ సెంటర్ రావడమే.
అవును విశాఖ రుషికొండ సమీపంలో ఉన్న కేంద్రంలో నాలుగు రోజుల ధ్యాన కోర్సు భగవంత్ మాన్ వచ్చారు. ఆయన శుక్రవారం కోర్సు పూర్తికాగానే సీఎం ఢిల్లీకి వెళ్లనున్నట్లు మొదట ప్రకటించినప్పటికీ.. శనివారం కూడా ఇక్కడ సాయంత్రం వెళ్లే అవకాశం ఉంది. ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి జీ అమర్‌నాథ్ మాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున జ్ఞాపికను అందజేశారు.

మాన్ శుక్రవారం విశాఖ ఫార్మా సిటీని సందర్శించారు. అయితే పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ కుమార్ జాఖర్ సోషల్ మీడియా పోస్ట్‌లో మాన్ నిర్ణయాన్ని విమర్శించారు. "ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జీ నాలుగు రోజుల పాటు ధ్యానం కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్నారు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అలా చేయడం ద్వారా అతను పంజాబ్‌లోని హోషియార్‌పూర్ ధ్యాన కేంద్రం సరిపోదని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడా?" అని ప్రశ్నించాడు.
విశాఖలో ఉన్న వెల్ నెస్ సెంటర్ ప్రపంచ ప్రఖ్యాతి గాచింది. ఇందులో విలాసవంతమైన సౌకర్యాలతో సెవెన్ స్టార్ హోటల్ ని మైమరిపించే సౌకర్యాలు ఉంటాయి. ఈ వెల్ నెస్ సెంటర్ లో శారీరక, మానసిక రుగ్మతులకు ప్రకృతి వైద్యాన్ని అందిస్తారు. ఇక్కడ అందుబాటులో ఉండే థెరపీలు అంతర్జాతీయంగా పేరుగాంచాయి. చాలా మంది దేశ విదేశాల నుంచి ఈ వెల్ నెస్ సెంటర్ కు వస్తుంటారు.












Click it and Unblock the Notifications