Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ బీజేపీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన పురందేశ్వరి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ రాస్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటించారు. మొత్తం 26 మందితో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శులుగా కాశీ విశ్వనాథరాజు, బిట్ర శివన్నారాయణ, దయాకర్ రెడ్డి, తపనా చౌదరి పేర్లను ఎంపిక చేశారు.

మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజుతో పాటు మరో 11 మంది బీజేపీ ఉపాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. మరోవైపు, బీజేపీ కార్యదర్శులుగా మరో పది మందికి చోటు దక్కింది. బీజేపీ అధికార ప్రతినిధులుగా ఏడుగురికి అవకాశం కల్పించారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కమిటీ, పలు మోర్చాల అధ్యక్షుల పేర్లను కూడా పురంధేశ్వరి ప్రకటించారు.

purandeswari announces the ap bjp new working committee

ఏపీ బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు: మిట్టా వంశీ
బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు: నిర్మలా కిశోర్
బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు: కుమారస్వామి
బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు: గుడిసె దేవానంద్
బీజేపీ ఎస్టీ మోర్చ అధ్యక్షుడు ఉమా మహేశ్వరరావు
బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు: గోపీ శ్రీనివాస్
బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు: షేక్ బాజీ
బీజేపీ మీడియా ఇంఛార్జీ: పాతూరి నాగభూషణం నియమితులయ్యారు.

ఏపీకి బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. ఆగస్టు 21న అమరావతికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియను ఆయన సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ, ఏపీతోపాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశా ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించే బాధ్యతను కూడా పార్టీ అధిష్టానం బండి సంజయ్‌కు అప్పగించింది.

కాగా, తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ నింపిన బండి సంజయ్ ఎంట్రీతో.. ఏపీ రాజకీయం కూడా రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ బండి సంజయ్ సేవలను ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. దీంతో ఆయన ఏపీ పర్యటనపై ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+