ఏపీలో బీజేపీ కొత్త గేమ్ - టార్గెట్ ఫిక్స్..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మూడు పార్టీలు ప్రభుత్వం నడుపుతున్నాయి. అటు కేంద్రం..ఇటు రాష్ట్రంలోనూ మూడు పార్టీలు అధికారంలో భాగస్వాములుగా ఉన్నాయి. మూడు పార్టీలు కలిసి ఉంటూనే ఎవరికి వారు తమ పార్టీ బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీలో బీజేపీ భవిష్యత్ ప్రణాళికలు.. కేంద్ర సహకారం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆసక్తి కర విశ్లేషణ చేసారు.

రాష్ట్రంలో కొత్త లెక్కలు
ఏపీలో బలోపేతం కావాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం పొత్తులతో ముందు సాగుతున్నా రానున్న రోజుల్లో బలోపేతం కు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. ఏపీకి కేంద్రం అందిస్తున్న సహకారం పైన పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పార్టీ నేతలకు ఢిల్లీ నాయకత్వం దిశా నిర్దేశం చేసింది. ఈ నాలుగు నెలల కాలంలో కేంద్రం ఏపీ కోసం తీసుకున్న నిర్ణయాలపైన ప్రత్యేకంగా మార్గ నిర్దేశం చేస్తున్నారు. ఇటు పురందేశ్వరి సైతం కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ అన్ని రాజకీయ పార్టీలకంటే భిన్నమైనదని చెప్పుకొచ్చారు.గతంలో 11కోట్ల సభ్యత్వాన్ని ఆరునెలలో చేసామని, ఇప్పుడు 45 రోజుల్లో 22 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేసామని పురందేశ్వరి తెలిపారు.

Purandeswari made interesting comments over Central funds for AP

ఏపీలో బలోపేతం
ఏపీలో రానున్న రోజుల్లో బీజేపీ ఒక బలమైన రాజకీయ పార్టీగా నిలబెట్టేందుకు పని చేస్తున్నామని పురందేశ్వరి వెల్లడించారు. ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్రం సహాయ సహకారాలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. తాజాగా కేంద్రం అమరావతి కనెక్టివిటీ కొరకు రైల్వే నిర్మాణం చేపట్టడం సంతోషకరమని అన్నారు. కాగా రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుందని, 12,500 కోట్ల రూపాయలు పోలవరం పూర్తి చేయటానికి నిధులు కేటాయిస్తామని పురందేశ్వరి హామీ ఇచ్చారు. 900 కోట్ల పై చిలుకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎన్డీయే ఉండాలని, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

కేంద్ర సాయం
రూ. 2,245 కోట్ల నిధులతో ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 57 కిలోమీటర్లు మేరకు అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు చేసిన అంశాన్ని ప్రకటించటం సంతోషంగా వుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహద పడుతుందన్నారు. అమరావతినే రాజధాని అని మొదటి నుంచీ బీజేపీ చెబుతోందని, కేంద్రం కూడా అమరావతి రాజధాని అని మొదటి నుండి ప్రతిపాదిస్తూనే వస్తోందని పురందేశ్వరి అన్నారు. రాజధాని కోసం ప్రత్యేక నిధులు ప్రపంచ బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింహ భాగం కేంద్రం నిధులు ఇస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+