పని చేయలేదని, ఇన్నాళ్లకు తెలిసి వచ్చిందా: బాబుపై పురంధేశ్వరి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు పురంధేశ్వరి బుధవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు సవరించాలని ఆమె ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

సొంత కంపెనీ నిర్లక్ష్యం: టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌పై బాబు ఫైర్

 ఇప్పుడు గుర్తుకు వచ్చిందా

ఇప్పుడు గుర్తుకు వచ్చిందా

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌ట్రాయ్ పని చేయలేదని ఇన్నాళ్లకు మీకు గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు.

  YSRCP MLA Roja Forcing Me to Join YSRCP : Daggubati Purandeswari - Oneindia Telugu
   గడ్కరీకి విజ్ఞప్తి

  గడ్కరీకి విజ్ఞప్తి

  2013 భూసేకరణ చట్టం ప్రకారం అంచనాలు పెంచాలని పురంధేశ్వరి.. గడ్కరీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. 2019 నాటికి పోలవరం పూర్తి కావడానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

   ట్రాన్స్‌ట్రాయ్ పనులు చేయలేకపోతోంది

  ట్రాన్స్‌ట్రాయ్ పనులు చేయలేకపోతోంది

  రాయలసీమ, కృష్ణా డెల్టాలకు పోలవరం నిర్మాణం ఎంతో అవసరమని పురంధేశ్వరి లేఖలో పేర్కొన్నారు. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ పనులు చేయలేకపోతోందని ఆమె పేర్కొన్నారు.

   మూడేళ్లకు తెలిసిందా

  మూడేళ్లకు తెలిసిందా

  ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు పోలవరం పనులు చేయలేకపోతోందని రాష్ట్ర ప్రభుత్వానికి మూడేళ్లకు తెలిసిందా అని పురంధేశ్వరి ప్రశ్నించారు. అర్హత లేని ట్రాన్స్‌ట్రాయ్‌కు పోలవరం కాంట్రాక్ట్ పనులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. అంచనాలు పెంచాలని కేంద్రాన్ని అడగాల్సిన ప్రభుత్వం 60సీ కింద ట్రాన్స్‌ట్రాయ్‌కు నోటీసులు ఇచ్చిందన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  BJP leader Purandeswari takes on Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu government over Polavaram Project.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి