Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబును నిద్రలేపడం మావల్ల కాదు, వైసీపీ రాజీనామాలు కాదు.. ముందు ఇది చెప్పు: దులిపేసిన పురంధేశ్వరి

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి మంగళవారం నేరుగా విమర్శలు గుప్పించారు. నిద్రపోతున్న వారిని లేపవచ్చు కానీ నిద్రపోతున్నట్లు నటిస్తున్న చంద్రబాబు వంటి వారిని లేపటం తమ వల్ల కాదని ఆమె దెప్పిపొడిచారు.

మంగళవారం ఉదయం మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ భేటీ జరిగింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల పైన చర్చించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవేవీ పట్టనట్లు ప్రభుత్వం నటిస్తోందన్నారు.

అలా చేస్తేనే నిధులు వస్తాయి

అలా చేస్తేనే నిధులు వస్తాయి

పోలవరం ప్రాజెక్టు పైన ఆరోపణలు చేయడం తమ ఉద్దేశ్యం కాదని పురంధేశ్వరి చెప్పారు. తాము పోలవరం ప్రగతిని చూపించడానికే మీడియాను తీసుకు వెళ్లామని చెప్పారు. రూ.1900 కోట్ల పోలవరం బిల్లులు ఇంకా కేంద్రానికి చేరలేదని చెప్పారు. కొత్త డీపీఆర్ ఇస్తే సరిపోదని, భూసేకరణ వివరాలు ఇస్తేనే నిధులు వస్తాయన్నారు. నిర్వాసితుల పరిహారం లోపాలపై పరిశీలన చేస్తున్నామని చెప్పారు.

 అందుకే కాంగ్రెస్ పార్టీని వదిలేశా

అందుకే కాంగ్రెస్ పార్టీని వదిలేశా


అదే సమయంలో తాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశానో కూడా పురంధేశ్వరి చెప్పారు. 7 మండలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లే తాను ఆ పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని గుర్తు చేశారు.

వైసీపీ రాజీనామాలపై కౌంటర్

వైసీపీ రాజీనామాలపై కౌంటర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు డ్రామాలు అని టీడీపీ నేతలు మాట్లాడటంపై కూడా ఆ పార్టీ నేతలకు పురంధేశ్వరి గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజీనామాలను డ్రామాలు అనడం సరికాదన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలే అయితే, మరి వేరే పార్టీ వాళ్లను కేబినెట్లో చేర్చుకున్న దానికి మీరు ఏం సమాధానం నిలదీశారు. రాజీనామాలు చేసి పార్టీ మారిన వాళ్ల విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదో చెప్పాలని ప్రశ్నించారు.

అందుకే పోలవరం సందర్శన

అందుకే పోలవరం సందర్శన

కాగా, ఆదివారం బీజేపీ నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. దీనిపై వారు సోమవారం మాట్లాడుతూ.. ఏపీకి పోలవరం ఒక వరమని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్డుపడుతోందని కొందరు కావాలనే కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరిలు అన్నారు. పాతరేట్లకే ప్రాజెక్టు పనులు చేయించింది కేంద్రమంత్రి గడ్కరీయే అన్నారు. వచ్చే వేసవికాలం నాటికి పోలవరం పూర్తి చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. కేంద్రం ఈ ప్రాజెక్టును బాధ్యతగా తీసుకుందని, కాబట్టి సమీక్షించాల్సిన బాధ్యత తమపైన ఉందన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇంకా చెల్లించని బిల్లులు లేవని ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. పోలవరానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. నూటికి నూరుశాతం కేంద్రం నిధులతో ఈ ప్రాజెక్టును కడుతున్నారన్నారు. దాదాపు రూ.16వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని నూరుశాతం కేంద్రమే భరిస్తోందన్నారు. పోలవరం బాధ్యత తమది అని గడ్కరీ చెప్పారని, చంద్రబాబుకి నిజం చెప్పడం రాదని, తమకు అబద్ధం చెప్పడం రాదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+