పురందేశ్వరి సీటు మారుతోందా - కోల్డ్ వార్, టిడిపిలో టెన్షన్..!!
ఏపీలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతుంది. పొత్తుల్లో టిడిపి,బిజెపి,జనసేన పోటీ చేసే సీట్ల పైన క్లారిటీ వచ్చింది. బిజెపి ఆరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. కానీ అనూహ్యంగా బిజెపి నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు కూటమి పార్టీలను టెన్షన్ పడుతున్నాయి.
Recommended Video

అభ్యర్థుల ఖరారు
బిజెపి ఏపీలో 6 ఎంపీ స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. తొలుత విజయనగరం బిజెపికి కేటాయించారు. కానీ, తర్వాత జరిగిన చర్చల్లో విజయనగరం స్థానంలో రాజంపేట బిజెపి తీసుకుంది. అక్కడి నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ కు ఛాన్స్ దక్కింది. రాజమండ్రి ఎంపీగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు ప్రకటించారు. ఇప్పుడు అక్కడే అసలు సమస్య మొదలైంది. రాజమండ్రి సీట్ కోసం బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమ వీర్రాజు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. చర్చల్లో భాగంగా వీర్రాజును అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఒప్పించారు. బిజెపి నుంచి పోటీ చేయాలని ఆశించిన రఘురామకు సీటు రాకుండా చేయడంలో వీర్రాజు పాత్ర ఉందని రఘురామ స్వయంగా చెప్పుకొచ్చారు.

పార్టీలో భిన్నాభిప్రాయాలు
ఇప్పుడు సోము వీర్రాజు పోటీ చేసే స్థానం పైన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోమ వీర్రాజును రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ స్థానం కేటాయించేలా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనపర్తి టిడిపికి కేటాయించారు. ఆస్థానం ఇప్పుడు బిజెపికి మారనున్నట్లు తెలుస్తుంది. అక్కడి నుంచి సోము వీర్రాజు బరిలోకి దిగుతారని సమాచారం. అయితే సోము వీర్రాజుకు అనపర్తి సీటు ఇస్తే రాజమండ్రి లోక్సభ పైన ప్రభావం ఉంటుందని పురందేశ్వరి వాదిస్తున్నారు. అనపర్తి సీటు వీర్రాజు కేటాయిస్తే తాను రాజమండ్రి నుంచి పోటీ చేయటం పైన పునరాలోచన చేయాల్సి ఉంటుందని చెప్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సామాజిక సమీకరణాల పరంగా అనపర్తిలో రెడ్డి, ఎస్సీ వర్గాలు ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది.
కూటమిలో టెన్షన్
అక్కడ ఇప్పటికే వైసిపి, టిడిపి అభ్యర్థులు బిజెపి అనపర్తి సీటు కోరితే అక్కడ మార్పు జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. ఇప్పటికే నరసాపురం స్థానం పార్టీ నేత శ్రీనివాస వర్మకు బిజెపి కేటాయించింది. రఘురామరాజు నిర్ణయం ఏంటి అనేది కీలకంగా మారుతుంది. ఇదే సమయంలో జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, విజయవాడ పశ్చిమం నుంచి సుజన చౌదరి, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ధర్మవరం నుంచి వరదాపురం సూరి సీటు ఆశిస్తుండగా అక్కడి నుంచి తాజాగా సత్య కుమార్ పేరు తెరమీదకు వచ్చింది. దీంతో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పుడు ప్రహసనంగా మారుతుంది. సొంత పార్టీ నేతల నుంచి అభ్యర్థుల విషయంలో వ్యతిరేకత కనిపిస్తుంది. బిజెపిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అభ్యర్థుల ఎంపిక కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న టిడిపి, జనసేన లో టెన్షన్ పెంచుతున్నాయి.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications