స్మగ్లింగ్ చేస్తున్న ఎర్ర చందనం దుంగల కోసం.. తిరుపతిలో పుష్ప సినిమా మాదిరి ఛేజింగ్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చాప క్రింద నీరులాగా కొనసాగుతూనే ఉంది. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న తీరు అధికారులకు విస్మయాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వీరి ఆగడాలకు అడ్డు కట్ట వెయ్యటం పోలీసులకు, టాస్క్ ఫోర్స్ అధికారులకు పెద్ద సవాల్ గా మారింది. అంతర్రాష్ట్ర స్మగ్లర్లు మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎర్రచందనం దుంగలను ఎవరికీ అర్ధం కాకుండా సీక్రెట్ గా గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. ఇక తాజాగా చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను చేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు.

తిరుపతిలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు ఎంత నిఘా పెట్టినా సరే ఎర్రచందనం స్మగ్లింగ్ కొనసాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం స్మగ్లర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తాజాగా లగేజీ ముసుగులో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు సినీ ఫక్కీలో ఛేదించారు. అచ్చం పుష్ప సినిమా మాదిరి జరిగిన ఈ ఛేజింగ్ లో పోలీసులు 44 మంది కూలీలను అరెస్ట్ చేశారు. 21 కిలోమీటర్ల మేర స్మగ్లర్లను పట్టుకోవడం కోసం పోలీసులు సాగించిన ఛేజింగ్ స్థానికంగా హాట్ టాపిక్ అయింది.

 Pushpa movie style chase to caught smuggling red sandalwood logs in tirupati!!

తిరుపతి జిల్లాలో లగేజి ముసుగులో అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సాగించిన వేటలో 44 మంది కూలీలను అరెస్ట్ చేశారు. మొత్తం కూలీల నుంచి 11 గొడ్డళ్లు, 32 రంపాలు, ఒక అశోక్ లేలాండ్ లారీ, మారుతి డిజైర్ వాహనం, భారత్ బెంజ్ లారీ ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2632 కిలోల బరువున్న 81 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు ఈ ఎర్రచందనం దుంగల విలువ రెండు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. త్వరలో ఎర్రచందనం కింగ్ పిన్స్ ను పట్టుకుంటామని చెబుతున్న పోలీసులు, ఈ ఘటనలో పట్టుబడిన వారిని విచారిస్తున్నారు.

అయితే ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్పందించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ కు పాల్పడితే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసులు ఎంతో ధైర్యసాహసాలతో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారిని పట్టుకున్నారని ఎస్పీ తెలిపారు. ఇందులో సత్యనారాయణ, స్వామి నాథన్ లు ప్రధాన ముద్దాయిలని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+