సింధుకి మరో గిఫ్ట్: బెజవాడలో రెడీగో స్పోర్ట్స్ కారు తాళాలు అందజేత

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి భారత దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తంగా ఇమడింపజేసిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు మరో కానుక లభించింది. డాట్సన్ కంపెనీ ప్రతినిధులు బుధవారం ఆమెకు రెడీగో స్పోర్ట్స్ కారును బహూకరించారు.

విజయవాడలోని ఎనికేపాడులోని లక్కీ నిస్సాన్ షోరూమ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింధును కంపెనీ ప్రతినిధులు సన్మానించారు. అనంతరం ఆమెకు డాట్సన్ రెడీగో స్పోర్ట్స్ కారు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడారు. కారుని తనకు కానుకగా అందజేసిన కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు.

pv sindhu got one more gift from nissan company

కష్టపడితే ఎవరికైనా విజయం సొంతమవుతుందని తెలిపారు. తాను ఎంతో కష్టపడి ఒలింపిక్స్‌లో పతకం సాధించానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువత ఏకాగ్రత, పట్టుదలను అలవరుచుకుంటే ఎదైనా సాధించవచ్చునని సూచించారు. ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ప్రయివేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ మాట్లాడారు.

తన క్రీడా ప్రతిభ ద్వారా దేశానికి వన్నె తెచ్చిన సింధుకు కారును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కారులో ఎన్నో అకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+