ఎట్టకేలకు మౌనం వీడిన పీవీ సింధు

PV Sindhu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పండుగ వాతావరణంలో వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంటోంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, సభలు, సమావేశాలను నిర్వహిస్తోంది.

ఈ ఏడాది జూన్‌ 12వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంతో కలుపుకొని ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పగ్గాలను చేపట్టారు. చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ సహా మంత్రులందరూ అదే రోజున ప్రమాణం చేశారు.

PV Sindhu has praised NDA govt led by the CM Chandrababu Naidu in Andhra Pradesh

ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో సభలు, సమావేశాలను నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చర్చాగోష్ఠీలకు పిలుపునిచ్చింది. ఈ 100 రోజుల్లో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు.

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలెబ్రిటీలు, క్రీడాకారుల నుంచి అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం. తాము సాధించిన విజయాలన్నింటినీ కూడా వారి నోటి ద్వారానే రాష్ట్ర ప్రజలందరికీ వినిపిస్తోంది.

ఈ క్రమంలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెరమీదికి వచ్చారు. ఏపీ ప్రభుత్వంలో గ్రూప్ 1 స్థాయి డిప్యూటీ కలెక్టర్‌గా కొనసాగుతున్నారామె. ప్రభుత్వంలో భాగస్వామినయినందుకు చాలా గర్వంగా భావిస్తోన్నానని చెప్పారు. తనకు చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని కల్పించారని గుర్తు చేశారు.

ఈ వంద రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో ఆర్థిక సవాళ్లు, భారీ వరదలను ఎదుర్కొందని, అయినప్పటికీ చంద్రబాబు తన విజన్‌, అపారమైన రాజకీయ అనుభవంతో రాష్ట్రం వాటిని అధిగమించిందని పీవీ సింధు అన్నారు. ఆర్థిక సంక్షోభం, వరద విపత్తుల నుంచి రాష్ట్ర ప్రజలు బయటపడగలిగారని కొనియాడారు.

క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని, ప్రజలను గండం నుంచి గట్టెక్కించిన చంద్రబాబుకు క్రీడాకారుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకొంటోన్నట్లు పీవీ సింధు చెప్పారు. ఇలాంటి ప్రభుత్వం సమాజానికి, ప్రజలకు ఎంతో అవసరమని ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+