చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను కలిసిన పీవీ సింధు
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 22న వెంకట దత్త సాయిని ఆమె వివాహం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేర్వేరుగా కలిశారు పీవీ సింధు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లి నివాసంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కలిశారు. తన వివాహానికి రావాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందించారు. మరోవైపు, మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసిన పీవీ సింధు.. వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. పీవీ సింధు, ఆమె తండ్రి రమణతో ఉప ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించారు.

కాగా, శనివారంనాడు పీవీ సింధు, వెంకట దత్త సాయిల నిశ్చితార్థం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సింధు తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. 'ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు.. మనం కూడా ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ తనంతట తానుగా ఏమీ ఇవ్వదు' అనే లెబనీస్ రచయిత ఖలీల్ జిబ్రాన్ కోట్‌ను క్యాప్షన్‌గా జత చేసింది.
హైదరాబాద్‌కు చెందిన వెంకటసాయి.. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. డిసెంబర్ 22న దత్తసాయితో పీవీ సింధు వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో వీరి పెళ్లి జరుగుతుంది. డిసెంబర్ 20 నుంచి సింధు పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇక, డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
తమ రెండు కుటుంబాలకు చాలా కాలం నుంచి పరిచయం ఉందని.. కానీ, నెల కిందటే పెళ్లి ఖాయం చేసుకున్నామని పీవీ సింధు తండ్రి పీవీ రమణ మీడియాకు తెలిపారు. డిసెంబర్ 22న పెళ్లి వేడుకకు ముహూర్తం నిర్ణయించామని, 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడుతోందని.. అందుకే డిసెంబర్ 22న పెళ్లి వేడుకకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications