Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరంజీవి తక్కువోడేం కాదు.. చేయాల్సింది అంతా చేసి

గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డిపై కూటమి నేతలు, ముఖ్యంగా పవన్ కల్యాణ్, సినీ పరిశ్రమను అవమానించారనే ఆరోపణలను అస్త్రంగా వాడుకున్న విషయం తెలిసిందే. టికెట్ల ధరల విషయంలో జగన్ ఇండస్ట్రీని కించపరిచారంటూ విస్తృత ప్రచారం జరిగింది. దీనిపై చిరంజీవి కూడా బహిరంగంగా మాట్లాడకుండా, కూటమికి అనుకూలంగా మౌనంగా ఉన్నారు. అయితే, సీనియర్ నటుడు ఆర్. నారాయణ మూర్తి చేసిన తాజా వ్యాఖ్యలు ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టాయి.

ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ, టికెట్ల రేట్ల పెంపు విషయంలో జగన్ చిరంజీవిని అవమానించలేదని, అలాగే సినీ ఇండస్ట్రీని తక్కువ చేయలేదని స్పష్టం చేశారు.టికెట్ల రేట్ల విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారు చిరంజీవికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చిరంజీవి ఎలా కోరితే, అలాగే చేద్దామని జగన్ చెప్పారని ఆర్. నారాయణ మూర్తి తెలిపారు. దీంతో, జగన్ ఇండస్ట్రీని అవమానించారన్న ప్రచారం నిరాధారమైనదిగా తేలింది.

R Narayana Murthy Reveals Truth Behind Jagan-Chiranjeevi Insult Row
ఈ నేపథ్యంలో, చిరంజీవి సైతం ఆ సమయంలో తనను జగన్ అవమానించారన్న వార్తలపై స్పందించకుండా 'స్మార్ట్‌గా యాక్ట్' చేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో, ఈ మొత్తం అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. బాలకృష్ణ వ్యాఖ్యల కారణంగానే, చిరంజీవి జగన్ విషయంలో అవమానం అనే అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారనే బండారం బయటపడిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ తనని అవమానించారని అంశంపై మౌనంగా ఉన్న చిరంజీవి ఒకవైపు తనపై వచ్చిన అవమానాన్ని మౌనంగా స్వీకరిస్తూనే, మరోవైపు జగన్‌పై వచ్చిన విమర్శల విషయంలో కూటమికి మద్దతుగా వ్యవహరించడం వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందనే చర్చ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+