• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిరెడ్డికి రాజ్యసభ సీటు లేదు- నర్సాపురంలో ఎంపీ అభ్యర్దిగా : రఘురామ సవాల్ తో..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఒక వైపు రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యోగ సంఘాల ఆందోళన ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది. ఆర్దిక పరిస్థితుల కారణంగా తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు వెళ్లలేక ప్రభుత్వం ... నిర్ణయం వెనక్కు తీసుకుంటేనే ఆందోళన విరమిస్తామంటూ ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పటంతో పీఆర్సీ వ్యవహారం పీఠముడిగా మారుతోంది. ఉద్యోగ సంఘాలు ఈ రోజున ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకొనే నిర్ణయాల తరువాత తమ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దమైంది.

ఇద్దరు ఎంపీల మధ్య డైలాగ్ వార్

ఇద్దరు ఎంపీల మధ్య డైలాగ్ వార్

ఇది కొనసాగుతున్న సమయంలోనే వైసీపీ కి చెందిన పార్లమెంటరీ పార్టీ నేత... రెబల్ ఎంపీ రఘురామ మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. రఘురామ తొలుత వైసీపీ నిర్ణయాలతో విభేదించిన సమయంలో సాయిరెడ్డి పైన విమర్శలు గుప్పించేవారు. పార్లమెంటరీ పార్టీ నేతగా రఘురామ రాజు పైన అనర్హత వేటు వేయాలంటూ సాయిరెడ్డి అనేక ప్రయత్నాలు చేసారు. స్పీకర్ కు ఫిర్యాదులు చేసారు.

తిరిగి, ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా కౌంటర్లు కంటిన్యూ అవుతున్నాయి. సాయిరెడ్డి తన ట్వీట్ లో.. ''నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్ మైక్ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్‌మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదా?. గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా'' అని విజయసాయి ప్రశ్నించారు.

నర్సాపురంలో పోటీ చేయాలంటూ

నర్సాపురంలో పోటీ చేయాలంటూ

దీనికి కౌంటర్ గా.. ''నా జీవితం నీకు, ఏ1కి భారంగా ఉందనే కదా. నన్ను కూడా వివేకానందరెడ్డిలా కడతేర్చాలనుకుంటున్నారు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని.. రొచ్చులో తొక్కేరోజు దగ్గర పడింది.. ఏ2'' అని రఘురామ హెచ్చరించారు. ఈ ట్వీట్ల వార్ పీక్ కు చేరింది. ఇద్దరూ ఒకరి పైన కైంటర్లు చేయటం.. స్ట్రాంగ్ రిప్లైలు ఇవ్వటం కొనసాగుతోంది. ఇక, రఘురామా తాజాగా విజయ సాయిరెడ్డి కి సవాల్ చేసారు. రాజ్యసభ పదవీకాలం పూర్తికావస్తున్న విజయసాయిరెడ్డికి, మరోసారి ఆ సీటు కచ్చితంగా ఇవ్వరని రఘురామ జోస్యం చెప్పారు.

ఉప ఎన్నిక వస్తుందా

ఉప ఎన్నిక వస్తుందా

ముఖ్యమంత్రి అత్యంత అసహ్యించుకుంటున్న తనను తిడితే ఎంపీ సీటు అనే ప్రైజ్‌ మనీ దక్కించుకునేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనపై ట్వీట్లు చేసే బదులు దమ్ముంటే తనపై నర్సాపురంలో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. ఇప్పటికే రఘురామ రాజీనామా అంశం పైన వైసీపీలో అంతర్గత చర్చ కొనసాగుతోంది. వైసీపీ నేతలు ఇప్పటికీ రఘురామ రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. రఘురామ తాను ఖచ్చితంగా రాజీనామా చేస్తానని.. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ నుంచి అభ్యర్ధి ఎవరు

వైసీపీ నుంచి అభ్యర్ధి ఎవరు

అయితే, నిజంగా వైసీపీకి ..ఎంపీ రాజీనామా చేస్తానని రఘురామ పదే పదే చెబుతున్నారు. అయితే, రఘురామ సైతం ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే అంశం పైన క్లారిటీ లేదు. దీంతో..రఘురామ వర్సెస్ సాయిరెడ్డి మధ్య సాగుతున్న ట్వీట్ల వార్..ముదురుతోంది. ఇక, ఇప్పుడు రాజీనామా డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అటు రఘురామ ఎటువంటి అడుగులు వేస్తారో.. దీనికి ప్రతి స్పందనగా వైసీపీ అధినాయకత్వం ఏ రకమైన వ్యూహాలు అమలు చేస్తుందో అనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
YCP Parliamentary party leader Vijaya Sai Reddy and Rebel MP Raghu Rama Raju twitter war is in peak with political counters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X