Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రఘురామ సక్సెస్ అవుతోంది అక్కడే..వైసీపీ ఎంపీల ప్రేక్షక పాత్ర..ఢిల్లీ కేంద్రంగా..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఏం చేసినా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఢిల్లీ కేంద్రంగా ఆయన నిరంతరం ఏపీ ప్రభుత్వం..సీఎం జగన్ నిర్ణయాల పైన ప్రత్యక్షంగా- పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ ఎంపీగా కొనసాగుతూనే ఆ పార్టీ లోపాలను ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు వైసీపీ వర్సెస్ రఘురామ రాజు అన్నట్లుగా పరిస్థితి మారింది. అయితే, మీడియా సమావేశాల ద్వారా నిరంతరం వైసీపీ ముఖ్య నేతలను ఇరుకున పెడుతున్న రఘురామ రాజు తాజాగా..లోక్ సభలోనూ వైసీపీ ఎంపీలను డామినేట్ చేస్తున్నారు. ఢిల్లీలో ఆయన డామినేషన్..నియోజకవర్గాల్లో వైసీపీ ఇతర ఎంపీల ఆరదణ కొనసాగుతోంది.

 పార్లమెంట్ కేంద్రంగా రఘురామ..

పార్లమెంట్ కేంద్రంగా రఘురామ..

2019 ఎన్నికల్లో వైసీపీ నుండి 22 మంది ఎంపీలు లోక్ సభ కు ఎన్నిక అయ్యారు. ఇప్పుడు ఆ 22 మంది ఏరకంగా లోక్ సభలో సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నారు..రఘురామ తీరు ఎలా ఉందనే ఆసక్తి రక అంశం పైన చర్చ సాగుతోంది. లోక్ సభ-రాజ్యసభ అదే విధంగా రాష్ట్రాల అసెంబ్లీల్లో సభ్యుల పని తీరు పైన నిత్యం అధ్యయనం చేసే పీఆర్ఎస్ సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. అందులో లోక్ సభలో ఏపీకి సంబంధించిన ఎంపీల పని తీరు పైన విశ్లేషణ చేసినట్లుగా ఒక రిపోర్ట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

 హాజరు-చర్చల్లో రఘురామే ముందు..

హాజరు-చర్చల్లో రఘురామే ముందు..

అందులో సభ్యుల సభకు హాజరు మొదలు చర్చల్లో ఏ రకంగా పాల్గొంటున్నారు... ప్రశ్నలు సంధించటం వంటి అంశాల పైన సమగ్రంగా విశ్లేషణ చేసారు. ఈ నివేదిక పరిశీలిస్తే...రఘురామ రాజు ఇతర వైసీపీ ఎంపీల కంటే సభకు హాజరులో ముందున్నారు. ఎంపీ అయిన సమయం నుంచి ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్న రఘురామ రాజు సభకు హాజరులో మాత్రం ఎక్కడా మినహాయింపు తీసుకోవటం లేదు. ఆయన హాజరు 96 శాతంగా రికార్డులకు ఎక్కింది.

 వైసీపీ ఎంపీలక కంటే బెటర్ గా..

వైసీపీ ఎంపీలక కంటే బెటర్ గా..

నిత్యం వైసీపీ ముఖ్య నేతల పైనే విమర్శలకే ఆయన సమయం కేటాయిస్తున్నారనే విమర్శల నడుమ ఆసక్తి కరంగా ఆయన సభలో 50 డిబేట్లలో పాల్గొన్నట్లుగా సర్వే చెబుతోంది. అంతే కాదు, 145 ప్రశ్నలను ఆయన వైసీపీలోని ఇతర సభ్యుల కంటే ఎక్కువగా ప్రభుత్వాన్ని సంధించినట్లుగా సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ఇతర ఎంపీల పని తీరును విశ్లేషించింది. ముఖ్యమంత్రి బంధువు..కడప ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరు శాతం తక్కువగా ఉన్నా..146 ప్రశ్నలను సభలో సంధించారు.

 సీఎం జగన్ సూచించినా..అదే దారిలో

సీఎం జగన్ సూచించినా..అదే దారిలో

ఇక, టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న గల్లా జయదేవ్ హాజరు 89 శాతం గా రికార్డు అయింది. ఆయన 54 డిబేట్లలో పాల్గొన్నారు. మొత్తం 133 ప్రశ్నలను సంధించారు. టీడీపీ మరో ఎంపీ గల్లాతో సమానంగా హాజరు శాతంలో పోటీ పడుతున్నారు. అయితే, వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఇప్పటి వరకు ఒక్క ప్రశ్న కూడా సభలో ప్రస్తావించినట్లుగా లేదు. ఆయన ప్రశ్నలే కాదు..చర్చల్లోనూ పాల్గొనలేదు. పార్లమెంట్ సమావేశాలు జరిగే ప్రతీ సందర్భంలోనూ ముఖ్యమంత్రి జగన్ ఎంపీల సమావేశం నిర్వహించటం ఆనవాయితీ.

 ఈ సమావేశాల్లో గతం కంటే భిన్నంగా..

ఈ సమావేశాల్లో గతం కంటే భిన్నంగా..

ఏపీకి సంబంధించిన అంశాలను సభలో ప్రస్తావించాలని సూచించటం కామన్. కానీ, ఏపీ అంశాలే కాదు.. వారి నియోజకవర్గ అంశాలను ప్రస్తావించటంలో వైసీపీ ఎంపీలు వెనుకబడి ఉన్నారు. ప్రస్తుత సమావేశాల్లో మాత్రం వైసీపీ సభ్యలు ఇప్పుడు పోలవరం నిధులు-ప్రత్యేక హోదా-రాష్ట్ర విభజన హామీల అమలు పేరుతో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో రఘురామ రాజు పైన అనర్హత వేటు కోసమూ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి పోటిగా తన పైన అనర్హత వేటు పడదనే ధీమాతో ఉన్న రఘురామ ఆ దిశగా చర్యలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

 పార్లమెంట్ లోనే ఉంటూ..బీజేపీ నేతలకు దగ్గరగా

పార్లమెంట్ లోనే ఉంటూ..బీజేపీ నేతలకు దగ్గరగా

బీజేపీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న రఘురామ రాజు..నిత్యం పార్లమెంట్ లో ఉంటూ..వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు పీఆర్ఎస్ తాజా రిపోర్టు సైతం... పార్లమెంట్ వరకు రఘురామ మిగిలిన వైసీపీ ఎంపీలను డామినేట్ చేసిన అంశాన్ని స్పష్టం చేస్తోంది. కానీ, ఇదే సమయంలో వైసీపీ ఇతర ఎంపీలు నియోజకవర్గాలకు వెళ్తూ..స్థానికంగా తమ పట్టు కొనసాగిస్తున్నారు. కానీ, రఘురామ రాజు మాత్రం ఢిల్లీకే పరిమితం అవుతూ అక్కడ బలం పెంచుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+