Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబును ఫిక్స్ చేసిన రఘరామ, సీన్ రివర్స్ - వాట్ నెక్స్ట్..!!

ఏపీ ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జగన్ పైన నిత్య పోరాటం చేసిన రఘురామ రాజు ఎపిసోడ్ ఇప్పుడు అనూహ్య టర్న్ తీసుకుంది. బీజేపీ నుంచి నర్సాపురం సీటు ఆశించిన రఘురామకు నిరాశ మిగిలింది. దీంతో, తాజాగా తనకు నర్సాపురం సీటు ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు పైనే ఉందని తేల్చి చెప్పారు. పురందేశ్వరి సీటు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ నుంచి రఘురామకు సీటు పైన ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది.

రఘురామ కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ లక్ష్యంగా నాలుగేళ్ల కాలంగా రఘురామ పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలిచాయి. నర్సాపురం నుంచి కూటమి అభ్యర్దిగా రఘురామ పోటీలో ఉంటానని తాడేపల్లి గూడెంలో టీడీపీ - జనసేన సభలో ప్రకటించారు. ముందస్తు ఒప్పందంలో భాగంగానే నర్సాపురం స్థానం బీజేపీకి కేటాయించారని..తనకే సీటు దక్కుతుందని రఘురామ భావించారు. కానీ, అనూహ్యంగా రఘురామకు బీజేపీ సీటు తిరస్కరించింది. దీని వెనుక జగన్ కారణమని రఘరామ ఆరోపించారు. దీని కోసం బీజేపీ నేతలు చెబుతున్న కారణాలతో రఘురామ విభేదిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ను చివరి నిమిషంలో బీజేపీలో చేర్చుకొని సీటు ఇచ్చిన విషయం గుర్తు చేస్తున్నారు. తాను పార్టీలో చేరకపోవటం కారణం కాదనేది రఘురామ వాదన.

Raghu Rama Raju latest comments over Narsapuram Loksabha seat leads to new contrvoersy in AP NDA Alliance

సీటు కోసం పోరాటం
సీనియార్టీ ప్రకారమే బీజేపీలో సీట్లు ఇస్తే పురందేశ్వరి కంటే సీనియర్ అయిన సోము వీర్రాజుకు ఎంపీ సీటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పురందేశ్వరి కాంగ్రెస్ లో పదవులు అనుభవించి బీజేపీలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. బీజేపీలో చేరిన వరప్రసాద్ కోవర్టుగా అనుమానం వ్యక్తం చేసారు. టీడీపీ నుంచి తనకు విజయనగరం, ఉండి స్థానాలు ఇస్తున్నట్లుగా అవకాశం ఉందనే ప్రచారం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు నర్సాపురం స్థానం ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని స్పష్టం చేసారు. తనకు సీటు ఇప్పించలేని వ్యక్తి పోలవరం కడతారని, కేంద్రంతో పోరాటం చేసి రాష్ట్రానికి అన్ని సాధిస్తారంటే ఎలా నమ్ముతారని రఘురామ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బీజేపీ నిర్ణయం మార్చుకొనే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు.

రఘురామ వాట్ నెక్స్ట్
ఇప్పుడు రఘురామ ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ అభ్యర్దుల ఎంపిక, చంద్రబాబే తనకు నర్సాపురం సీటు ఇవ్వాలంటూ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల్లోనూ చర్చగా మారాయి. రఘురామకు సీటు విషయంలో బీజేపీ లో పునరాలోచన ఉండే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ ఖరారు చేసిన స్థానంలో టీడీపీ తమ అభ్యర్దిని దించే అవకాశం లేదు. అదే సమయంలో రఘురామ కాంగ్రెస్ వైపు వెళ్లనని స్పష్టం చేసారు. దీంతో, నామినేషన్ల సమయంలోగా కూటమి అభ్యర్దిగా నర్సాపురం నుంచి రఘురామ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం మొదలైంది. సీటు దక్కకపోతే..ఇప్పటి వరకు జగన్ పైన నిత్యం రచ్చబండ నిర్వహించిన రఘురామ..ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+