ఓటుకు నోటులో బాబు, ట్యాపింగ్‌లో కెసిఆర్: చిరుతో వెళ్లామన్న రఘువీరా
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు దోషులని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మంగళవారం అభిప్రాయపడ్డారు.
తాను, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, కెవిపి, రామచంద్రయ్య తదితరులం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశామని రఘువీరా విలేకరుల సమావేశంలో చెప్పారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదుకుంటానని చెప్పిన ప్రధాని మోడీ అన్యాయం చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడటంలో బీజేపీ, టీడీపీలు విఫలమయ్యాయన్నారు. విద్యుత్ ఉద్యోగులతో రెండు ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని ఆరోపించారు. విభజన చట్టంలోని సెక్షన్‌లన్నింటిని అమలుపరచాలని ఆయన డిమాండ్ చేశారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉందన్నారు. అలాగే, కెసిఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందన్నారు. ఇవి తీవ్రమైనవన్నారు. వీటిపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. రాజధాని భూసేకరణ కోసం సారవంత భూములు తీసుకుంటున్నారని, ఇది సరికాదన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై కెఇ
ప్రకాశం, కర్నూలు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు గ్రేట్ విక్టరీ అని కెఇ కృష్ణమూర్తి అన్నారు. ధర్మం తమ పక్షాన ఉంది కాబట్టి గెలిచామన్నారు. తమ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవాస్తవ ఆరోపణలు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications